గర్భిణుల్లో మధుమేహం...బిడ్డకు పాలిస్తే దీర్ఘకాలం రక్షణ!
గర్భిణిగా ఉన్నపుడు జెస్టేషనల్ మధుమేహానికి గురయ్యే మహిళలు బిడ్డకు పాలివ్వడం ద్వారా, భవిష్యత్తులో ఆ సమస్యకు దూరంగా ఉండవచ్చని పరిశోధనల్లో రుజువైంది. గర్భిణిగా ఉన్నపుడు వచ్చే ఈ తరహా మధుమేహం ప్రసవం తరువాత తగ్గిపోతుంది. అయితే వీరికి భవిష్యత్తులో మధుమేహం వచ్చే ముప్పు ఇతరులకంటే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మహిళలు బిడ్డకు పాలివ్వడం ద్వారా దీర్ఘకాలం పాటు మధుమేహం రాకుండా రక్షణ పొందవచ్చని జర్మనీ పరిశోధకులు చెబుతున్నారు. మూడునెలలకు మించి బిడ్డకు పాలిచ్చినపుడు శరీరంలో జీవ క్రియ […]
గర్భిణిగా ఉన్నపుడు జెస్టేషనల్ మధుమేహానికి గురయ్యే మహిళలు బిడ్డకు పాలివ్వడం ద్వారా, భవిష్యత్తులో ఆ సమస్యకు దూరంగా ఉండవచ్చని పరిశోధనల్లో రుజువైంది. గర్భిణిగా ఉన్నపుడు వచ్చే ఈ తరహా మధుమేహం ప్రసవం తరువాత తగ్గిపోతుంది. అయితే వీరికి భవిష్యత్తులో మధుమేహం వచ్చే ముప్పు ఇతరులకంటే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మహిళలు బిడ్డకు పాలివ్వడం ద్వారా దీర్ఘకాలం పాటు మధుమేహం రాకుండా రక్షణ పొందవచ్చని జర్మనీ పరిశోధకులు చెబుతున్నారు.
మూడునెలలకు మించి బిడ్డకు పాలిచ్చినపుడు శరీరంలో జీవ క్రియ పరమైన మార్పులు సంభవిస్తాయని, దీనివలన మధుమేహం ముప్పు నలభైశాతం వరకు తగ్గుతుందని గుర్తించామని వారు వెల్లడించారు. అయితే ఇందుకు గల కారణాలను కనుగొనాల్సి ఉందన్నారు. జెస్టేషనల్ డయాబెటిస్‌కి గురయి, ప్రసవం తరువాత అందులోంచి బయటపడిన మహిళలు బిడ్డకు పాలివ్వడం ద్వారా పదిహేనేళ్ల వరకు మధుమేహం రాకుండా రక్షణ పొందవచ్చని వారు తెలిపారు.