పది ఫెయిలయినా… బడికెళ్లొచ్చు!
పది, ఇంటర్ పరీక్షలు ఫెయిలయితే ఆ తరువాత స్కూలుకి, కాలేజికి వెళ్లే అవకాశం ఉండదు. దేశంలో ఎక్కడైనా ఇదే విధానం అమల్లో ఉంది. అలాంటి విద్యార్ధులు ఇంట్లోనే చదువుకుని పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇలాంటపుడు పేద, గ్రామీణ ప్రాంత విద్యార్థుల చదువుకి చాలావరకు బ్రేక్ పడుతుంది. అయితే అలాంటి ప్రమాదాన్ని నివారించడానికి కర్ణాటక ప్రభుత్వం ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టనుంది. పది, పీయుసి (ఇంటర్ సమాన) పరీక్షలు ఫెయిలయినవారు తిరిగి స్కూలు, కాలేజీలకు ఆదే క్లాసులకు […]
పది, ఇంటర్ పరీక్షలు ఫెయిలయితే ఆ తరువాత స్కూలుకి, కాలేజికి వెళ్లే అవకాశం ఉండదు. దేశంలో ఎక్కడైనా ఇదే విధానం అమల్లో ఉంది. అలాంటి విద్యార్ధులు ఇంట్లోనే చదువుకుని పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇలాంటపుడు పేద, గ్రామీణ ప్రాంత విద్యార్థుల చదువుకి చాలావరకు బ్రేక్ పడుతుంది. అయితే అలాంటి ప్రమాదాన్ని నివారించడానికి కర్ణాటక ప్రభుత్వం ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టనుంది. పది, పీయుసి (ఇంటర్ సమాన) పరీక్షలు ఫెయిలయినవారు తిరిగి స్కూలు, కాలేజీలకు ఆదే క్లాసులకు హాజరయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నారు. కర్ణాటక విద్యాశాఖా మంత్రి తన్వీర్ సేఠ్ గురువారం ఈ వివరాలు వెల్లడించారు. దేశం మొత్తంలో ఇలాంటి నూతన విద్యా విధానానికి తొలిసారి కర్ణాటకలోనే శ్రీకారం చుడుతున్నారు.