నాతో మాట్లాడాలనుకుంటే లండన్ రండి...విజయ్ మాల్యా!
బ్యాంకులకు రూ.9000 కోట్ల రుణాలు ఎగవేసి లండన్ లో తిష్టవేసిన కింగ్ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా తాను భారత్ రావటం కుదరదని, తనతో మాట్లాడాలనుకుంటే భారత దర్యాప్తు అధికారులే లండన్కి రావచ్చని అన్నారు. తన దౌత్య పాస్‌పోర్టుని రద్దు చేశారని, తాను భారత్కి వెళ్లలేనని ఆయన మోటార్ రేసింగ్ మేగజైన్ ఆటోస్పోర్ట్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. భారత అధికారులకు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఎగ్జిక్యూటివ్స్ అందరితో మాట్లాడే అవకాశం ఉందని, వేల పత్రాలను శోధించుకునే వీలు […]
బ్యాంకులకు రూ.9000 కోట్ల రుణాలు ఎగవేసి లండన్ లో తిష్టవేసిన కింగ్ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా తాను భారత్ రావటం కుదరదని, తనతో మాట్లాడాలనుకుంటే భారత దర్యాప్తు అధికారులే లండన్కి రావచ్చని అన్నారు. తన దౌత్య పాస్‌పోర్టుని రద్దు చేశారని, తాను భారత్కి వెళ్లలేనని ఆయన మోటార్ రేసింగ్ మేగజైన్ ఆటోస్పోర్ట్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. భారత అధికారులకు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఎగ్జిక్యూటివ్స్ అందరితో మాట్లాడే అవకాశం ఉందని, వేల పత్రాలను శోధించుకునే వీలు ఉందని చెప్పారు. ఇక తనతో ముఖాముఖి మాట్లాడాలని అనుకుంటే లండన్కి రావచ్చని, లేదా రేడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడవచ్చని, ఈ- మెయిల్కి ప్రశ్నలు పంపినా తాను జవాబులు ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నానని, తన దగ్గర దాచుకోవాల్సింది ఏమీ లేదని మాల్యా చెప్పారు.
భారత అధికారులు మంత్రగత్తెను వేటాడుతున్నట్టుగా తనను వెంటపడుతున్నారని అన్నారు. గతంలో 1985లో ఒకసారి ఇలాగే భారత దర్యాప్తు సంస్థలు తనవెంటపడి చివరికి ఏమీలేదని తేల్చాయని, తనను నిర్దోషిగా ప్రకటించాయని మాల్యా అన్నారు. భారత్లో దర్యాప్తు సంస్థలు రాజకీయ నేతల చేతుల్లో పావులుగా మారాయని అందుకే ఇలా జరుగుతోందని మాల్యా చెప్పుకొచ్చారు. ఫోర్స్ ఇండియా ఫార్ములా వన్ అధిపతి అయిన మాల్యా, ఇంగ్లండు, నార్త్ యాంప్టన్ షైర్లో బ్రిటీష్ గ్రాండ్ ప్రిక్స్ కారు రేసుల్లో తన బృందాన్ని ప్రోత్సహిస్తూ కనిపించారు.
Click on Image to Read: