చరణ్ విమానాలకు చంద్రబాబు చేయూత
కారు కావచ్చు, బస్సు కావచ్చు, విమానం అయినా కావచ్చు కస్టమర్ల నుంచి డిమాండ్ ఉంటేనే సర్వీసులు నడుస్తాయి. ప్రయాణించేందుకు ప్రయాణికులు ముందుకు రాకపోతే సర్వీసులను నడపరు. కానీ చంద్రబాబు విమానసంస్థల కోసం ప్రజాధనాన్ని దోచిపెట్టే కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. డిమాండ్ ఉన్నా లేకున్నా ఏపీలో విమానాల మోత వినిపించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకోసం రాష్ట్రంలోని పలు నగరాల మధ్య విమానాలు తిప్పేందుకు విమానయాన సంస్థలతో విచిత్రమైన ఒప్పందం చేసుకుంది ఏపీ ప్రభుత్వం. ”మీరు విమానాలు తిప్పండి… […]
కారు కావచ్చు, బస్సు కావచ్చు, విమానం అయినా కావచ్చు కస్టమర్ల నుంచి డిమాండ్ ఉంటేనే సర్వీసులు నడుస్తాయి. ప్రయాణించేందుకు ప్రయాణికులు ముందుకు రాకపోతే సర్వీసులను నడపరు. కానీ చంద్రబాబు విమానసంస్థల కోసం ప్రజాధనాన్ని దోచిపెట్టే కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. డిమాండ్ ఉన్నా లేకున్నా ఏపీలో విమానాల మోత వినిపించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకోసం రాష్ట్రంలోని పలు నగరాల మధ్య విమానాలు తిప్పేందుకు విమానయాన సంస్థలతో విచిత్రమైన ఒప్పందం చేసుకుంది ఏపీ ప్రభుత్వం.
”మీరు విమానాలు తిప్పండి… జనం ఎక్కకపోతే ఆ డబ్బులు మేం చెల్లిస్తాం” అంటూ చంద్రబాబు ప్రభుత్వం ఆఫర్ చేసింది. తొలి దశలో ఈ ఆఫర్‌ను రాంచరణ్ తేజకు చెందిన మెగా టర్బోఎయిర్‌లైన్స్ సొంతం చేసుకుంది. ఇకపై ఈ విమానసర్వీస్ వారంలో మూడు రోజులు ఆరు ట్రిప్‌లు కడప- విజయవాడ-కడప, తిరుపతి-విజయవాడ-తిరుపతి మధ్య నడుపుతుంది. ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం… విమాన సర్వీసులు నడిపినప్పుడు సీట్లు నిండకపోతే ఆ మేరకు ప్రభుత్వమే విమానసంస్థకు నిధులు చెల్లిస్తుంది. అంటే విమానసంస్థకు గ్యారెంటీతో కూడిన లాభాల పంటే. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. విమానాలు ఎక్కేందుకు ప్రయాణికులే లేనప్పుడు ప్రజాధనం చెల్లించి ప్రైవేట్ విమాన సంస్థలను బతికించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు సామాన్యుడు ప్రయాణించే ఆర్టీసీని చావుదెబ్బతీస్తూ డబ్బున్న వాళ్లు ప్రయాణించే విమానాల విషయంలో మాత్రం ప్రజల సొమ్మును దోచిపెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
అన్నింటిమీద పన్నులు వేయడానికి, ప్రజల ముక్కుపిండి పన్నులు వసూలుచేయడానికి ముందుండే చంద్రబాబు అధికారంలోకి వచ్చీరాగానే విమాన ఇంధనానికి పన్నులు తగ్గించిన విషయం ఈ సందర్భంగా ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.
Click on Image to Read: