బిల్లును అడ్డుకునేందు లగడపాటి బ్యాగునిండా తెచ్చాడు... మేం చూశాం...
పార్లమెంటులో పెప్పర్ స్ర్పే ఘటనతో దేశం మొత్తం ఉలిక్కి పడిన సంగతి తెలిసిందే! పార్లమెంటు చరిత్రలో అదొక చీకటి దినంగా మిగిలిపోయింది. ఆ రోజు వాస్తవానికి ఏం జరిగింది? అన్న విషయాలను మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆరోజు ఫిబ్రవరి 14, 2014 తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెడుతున్నారు. ఎలాగైనా బిల్లు ఆపుతానని ముందురోజే లగడపాటి ప్రకటించడంతో తెలంగాణ ఎంపీలమంతా ఏం చేస్తాడా? అన్న ఉత్కంఠతతో […]
BY sarvi20 July 2016 2:42 PM IST
X
sarvi Updated On: 20 July 2016 2:57 PM IST
పార్లమెంటులో పెప్పర్ స్ర్పే ఘటనతో దేశం మొత్తం ఉలిక్కి పడిన సంగతి తెలిసిందే! పార్లమెంటు చరిత్రలో అదొక చీకటి దినంగా మిగిలిపోయింది. ఆ రోజు వాస్తవానికి ఏం జరిగింది? అన్న విషయాలను మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆరోజు ఫిబ్రవరి 14, 2014 తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెడుతున్నారు. ఎలాగైనా బిల్లు ఆపుతానని ముందురోజే లగడపాటి ప్రకటించడంతో తెలంగాణ ఎంపీలమంతా ఏం చేస్తాడా? అన్న ఉత్కంఠతతో ఉన్నాం. ముందురోజు సాయంత్రం అప్పటి ఎంపీలమంతా సమావేశమై లగడపాటిని ఎలా ఆపాలి? అన్న విషయం మీదే చాలా సేపు చర్చించాం. మేమంతా లగడపాటి ఆత్మహత్యాయత్నం చేస్తాడనుకున్నాం. లగడపాటి ఏం చేసినా దాన్ని అడ్డుకోవాలనుకున్నాం.
బిల్లును స్పీకర్ చదువుతుండగానే.. ఆంధ్ర ఎంపీలంతా నిరసన తెలపడం మొదలు పెట్టారు. మేము ప్రతిగా నిరసనలు తెలిపాం. అంత జరుగుతున్నా.. లగడపాటి ఏం చేస్తాడు? అన్న విషయంపైనే మా ఆందోళనంతా ఉంది. ఉన్నపళంగా ఏదో పొగ, పొడి మాపై కమ్ముకుంది. చేతిలో ఏదో సెంటు బాటిల్‌లాంటిది తీసి చల్లుతున్నాడు లగడపాటి. ఎలాగైనా అతన్నిఆపాలని.. అంతా కలిసి అతని మీద పడ్డాం. పక్కనే ఓ బ్యాగు ఉంది. దాన్నిండా అవే బాటిళ్లు ఉన్నాయి. వాటన్నింటినీ స్ప్రే చేశాడు కాబట్టే పార్లమెంటు లాబీ అంతా వ్యాపించింది. నాకైతే కళ్లు పోయాయి అనుకున్నా. కళ్లు మండడంతో తీవ్రంగా రోదించా. ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తరువాత లోకాన్ని చూడగలిగా. అని నాటి ఘటనను గుర్తుచేసుకున్నారు పొన్నం.
Next Story