వందల కోట్ల దేవుడు... చిల్లర పైరవీలు
ఇండియాతోపాటు, ప్రపంచమంతా సచిన్‌ను క్రికెట్ దేవుడిగా కొలుస్తారు. క్రికెట్ రంగంలో ఆయన సేవలకు గుర్తుగా భారతరత్న బిరుదు కూడా దక్కింది. ఇంతటి ప్రాధాన్యమున్న వ్యక్తి కేవలం 50 గజాల వివాదాస్పద స్థలం కోసం పైరవీలు చేసి భంగపడ్డారా? అంటే అవుననే అంటున్నాయి ఆంగ్లపత్రికలు. కానీ, తానెలాంటి అక్రమాలకు పాల్పడలేదని సచిన్ స్పష్టం చేస్తున్నారు. అసలు వివాదం ఏంటంటే… సచిన్ స్నేహితుడు, వ్యాపార భాగస్వామి అయిన సంజయ్ నారంగ్ అనే వ్యక్తికి ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో ఓ విడిది […]
BY sarvi20 July 2016 4:30 AM IST
X
sarvi Updated On: 20 July 2016 8:04 AM IST
ఇండియాతోపాటు, ప్రపంచమంతా సచిన్‌ను క్రికెట్ దేవుడిగా కొలుస్తారు. క్రికెట్ రంగంలో ఆయన సేవలకు గుర్తుగా భారతరత్న బిరుదు కూడా దక్కింది. ఇంతటి ప్రాధాన్యమున్న వ్యక్తి కేవలం 50 గజాల వివాదాస్పద స్థలం కోసం పైరవీలు చేసి భంగపడ్డారా? అంటే అవుననే అంటున్నాయి ఆంగ్లపత్రికలు. కానీ, తానెలాంటి అక్రమాలకు పాల్పడలేదని సచిన్ స్పష్టం చేస్తున్నారు.
అసలు వివాదం ఏంటంటే… సచిన్ స్నేహితుడు, వ్యాపార భాగస్వామి అయిన సంజయ్ నారంగ్ అనే వ్యక్తికి ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో ఓ విడిది గృహం ఉంది. దాని పక్కనే డీఆర్ డీఓకు సంబంధించిన స్థలం ఉంది. ఈ స్థలంలో నారంగ్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్నపుడు సచిన్ ఆస్ర్టేలియాలో ఉన్నాడు. అక్కడ నుంచి హుటాహుటిన ఇండియాకు వచ్చాడు సచిన్.
ఈ విషయం గురించి చర్చించేందుకు రక్షణశాఖమంత్రి మనోహర్ పారికర్‌ను కలిశారు. కానీ, ఆయన సచిన్ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. ఈ విషయం మీడియాకు లీకవ్వడంతో పెద్ద దుమారమే రేగుతోంది. దీనిపై సచిన్ వివరణ ఇచ్చుకున్నాడు. తన స్నేహితుని కోసం పారికర్‌ను కలిసిన మాట వాస్తవమేనని అంగీకరించారు. తానెలాంటి పైరవీలు చేయలేదని, కేవలం సమస్య పరిష్కరించాలని వినతిపత్రం మాత్రమే ఇచ్చానని వివరించాడు. మొత్తమ్మీద ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు లేవని సచిన్ స్పష్టం చేశాడు.
అయితే విమర్శకులు మాత్రం మీడియాలోని ఒక వర్గం సచిన్ ను క్రికెట్ దేవుడిగా దేశం మీద రుద్దిందని, ఆయన వ్యక్తిత్వానికి అంత స్థాయిలేదని అంటున్నారు. విదేశాల్లో బహూకరించిన కారుకు కూడా పన్ను రాయితీ ఇవ్వాలంటూ పైరవీలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వందల కోట్ల రూపాయలు సంపాదించిన సచిన్ ఇలా చిన్నచిన్న ప్రయోజనాల కోసం పైరవీలు చేయడం బట్టే ఆయన వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చంటున్నారు. నెల్లూరు జిల్లాలో తన భూములకోసం కొంత షో చేశాడని ఇలాంటివి మరికొన్ని విషయాలతో సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
Next Story