నేను ఎంపీ పీఏను... నాకు లొంగాల్సిందే... వికలాంగురాలిపై టీడీపీ ఎంపీ పీఏ దౌర్జన్యం
కాకినాడ టీడీపీ ఎంపీ తోట నరసింహం పీఏ శర్మపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. రాయుడు పాలెంలోని పీఎ శర్మ స్నేహితుడి ఇంట్లో అద్దెకు ఉంటున్న మహిళ తనపై శర్మ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో సర్పవరం పోలీసలు శర్మపై ఐపీసీ సెక్షన్లు 354, 506, 509 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. బాధితురాలు శర్మ స్నేహితుడి ఇంట్లో కొన్నాళ్లుగా అద్దెకు ఉంటూ, ఆ ఇంట్లోనే మహిళా సంఘాన్ని […]
కాకినాడ టీడీపీ ఎంపీ తోట నరసింహం పీఏ శర్మపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. రాయుడు పాలెంలోని పీఎ శర్మ స్నేహితుడి ఇంట్లో అద్దెకు ఉంటున్న మహిళ తనపై శర్మ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో సర్పవరం పోలీసలు శర్మపై ఐపీసీ సెక్షన్లు 354, 506, 509 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. బాధితురాలు శర్మ స్నేహితుడి ఇంట్లో కొన్నాళ్లుగా అద్దెకు ఉంటూ, ఆ ఇంట్లోనే మహిళా సంఘాన్ని నడుపుతున్నారు. గత కొద్దిరోజులుగా ఆ ఇల్లు ఖాళీ చేయాలని శర్మ తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది.
కొంచెం సమయమిస్తే ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పినా శర్మ మాత్రం వినడంలేదని ఆమె ఆరోపించారు. ఈ కారణంగా తనను నిత్యం లైంగికంగా వేధిస్తున్నారని బాధితురాలు చెప్పారు. వేధింపులు తారాస్తాయికి చేరడం వల్లే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ సందర్భంగా ఒక టీవి ఛానల్‌తో మాట్లాడుతూ “వికలాంగుల సేవా సంఘం నడిపితే ఏంవొస్తదే… నా దగ్గరకు రా అని వ్యాఖ్యానించాడని ఆమె చెప్పారు. పదే పదే ఇంటికివచ్చి తలుపుకొట్టి నువ్వు నా దగ్గరకి రావాల్సిందేనని లైంగికంగా శర్మ వేధించాడని బాధితురాలు చెప్పారు. తాను ఎంపీ తోట నరసంహం దగ్గర పీఏనని తనను ఎవరు ఏమీ చేయలేరని వికలాంగురాలువైన నువ్వు ఏం చేయగలవని బెదిరించినట్లు” బాధితురాలు మీడియాతో చెప్పారు. బట్టలు విప్పిపడుకో అని చాలా అసభ్యకరంగా మాట్లాడాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే పోలీసులు కూడా ఎంపీ పీఏకే వత్తాసు పలుకుతున్నారని బాధితురాలు ఆరోపించారు. అయితే శర్మ తాలూకు వ్యక్తుల కథనం మరోలా ఉంది. ఆ మహిళ ఇల్లు ఖాళీ చేయకుండా ఇంటి యజమానిని ఏడిపిస్తోందని, మిత్రుడికి సహాయం చేసిన శర్మను బ్లాక్ మెయిల్ చేయడానికే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తోందని వాళ్లు చెబుతున్నారు. అద్దె ఇంట్లో మహిళా సంఘాన్ని నడపగలిగిన శక్తి సామర్ధ్యాలు ఉన్న మహిళను శర్మలాంటి వ్యక్తులు వేధించగలరా? అని ప్రశ్నిస్తున్నారు.
Click on Image to Read: