నాగార్జునను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరారు...
నాటి అందాల తార సుమలత గతానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. సుమలతను చూసి నాగేశ్వరరావు తన కోడలిగా చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆమె ఒక కార్యక్రమంలో చెప్పారు. తన కలర్, హైట్‌ను చూసి నాగేశ్వరరావు ముచ్చటపడ్డారని చెప్పారు. ‘‘నీ కలర్, హైట్‌కి తగిన అబ్బాయి విదేశాల నుంచి వస్తున్నాడు. పెళ్ళి చేసుకుంటావా?’’ అని నాగేశ్వరరావు అడిగారన్నారు. తన తల్లితో మాట్లాడుతానని కూడా నాగేశ్వరరావు చెప్పారని గుర్తు చేసుకున్నారు. కుర్రాడు విదేశాల నుంచి వస్తున్నాడని అడిగేసరికి […]

నాటి అందాల తార సుమలత గతానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. సుమలతను చూసి నాగేశ్వరరావు తన కోడలిగా చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆమె ఒక కార్యక్రమంలో చెప్పారు. తన కలర్, హైట్‌ను చూసి నాగేశ్వరరావు ముచ్చటపడ్డారని చెప్పారు. ‘‘నీ కలర్, హైట్‌కి తగిన అబ్బాయి విదేశాల నుంచి వస్తున్నాడు. పెళ్ళి చేసుకుంటావా?’’ అని నాగేశ్వరరావు అడిగారన్నారు.
తన తల్లితో మాట్లాడుతానని కూడా నాగేశ్వరరావు చెప్పారని గుర్తు చేసుకున్నారు. కుర్రాడు విదేశాల నుంచి వస్తున్నాడని అడిగేసరికి సుమలత కూడా ఆ అబ్బాయి ఎవరని అడిగారట. అతను మరెవరో కాదు … మా అబ్బాయే… నా కొడుకు నాగార్జున అని నాగేశ్వరరావు చెప్పారని ఆమె వెల్లడించారు. అయితే నాగేశ్వరరావు విజ్ఞప్తికి తాను ఎలా రియాక్ట్ అయింది మాత్రం సుమలత చెప్పలేదు. అంటే అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే సుమలత నాగార్జునకు భార్య అయ్యేదన్న మాట. సుమలత నటుడు అంబరీష్‌ను వివాహమాడారు.
Click on Image to Read: