తాజ్‌మహల్ మూడేళ్లలో 75కోట్లు సంపాదించింది!
భారతదేశంలో చూడదగ్గ ప్రదేశాల్లో ముందువరుసలో ఉన్న తాజ్ మహల్, పర్యాటక ప్రాంతంగా మూడేళ్లకాలంలో 75కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. టికెట్ల అమ్మకం, ఇతర సేవలకు పొందిన రుసుము కలపగా వచ్చిన మొత్తమిది. అయితే దాని పరిరక్షణకు 11కోట్లు ఖర్చుపెట్టారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు రాత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్ర టూరిజం, సాంస్కృతిక శాఖా మంత్రి మహేష్ శర్మ ఈ వివరాలు వెల్లడించారు. తాజ్‌మహల్ రక్షణ, నిర్వహణ, పర్యాటక అభివృద్ధికోసం 11 కోట్లు ఖర్చయిందని, మిగిలిన మొత్తాన్ని ఆదాయాన్ని […]

భారతదేశంలో చూడదగ్గ ప్రదేశాల్లో ముందువరుసలో ఉన్న తాజ్ మహల్, పర్యాటక ప్రాంతంగా మూడేళ్లకాలంలో 75కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. టికెట్ల అమ్మకం, ఇతర సేవలకు పొందిన రుసుము కలపగా వచ్చిన మొత్తమిది. అయితే దాని పరిరక్షణకు 11కోట్లు ఖర్చుపెట్టారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు రాత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్ర టూరిజం, సాంస్కృతిక శాఖా మంత్రి మహేష్ శర్మ ఈ వివరాలు వెల్లడించారు.
తాజ్‌మహల్ రక్షణ, నిర్వహణ, పర్యాటక అభివృద్ధికోసం 11 కోట్లు ఖర్చయిందని, మిగిలిన మొత్తాన్ని ఆదాయాన్ని ఆర్జించలేని పురాతన కట్టడాల రక్షణ, నిర్వహణలకోసం ఖర్చుచేస్తున్నారని తాను అనుకుంటున్నట్టుగా ఆయన వెల్లడించారు. కర్ణాటక ఎంపి ఎస్పి ముద్ద హనుమ గౌడ, తాజ్‌మహల్ ద్వారా లభించిన ఆదాయ వివరాలు చెప్పాల్సిందిగా కోరగా మంత్రి ఈ వివరణ ఇచ్చారు.