వైద్య వ్యవస్థకు అనారోగ్యం...దేశంలో సగం మంది నకిలీ వైద్యులే!
మనం తింటున్న ఆహారంలో ఈ మధ్య కాలంలో కల్తీ బాగా పెరిగిపోయింది. ఇవే మన ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయనుకుంటే, ఆరోగ్యాన్ని కాపాడే వైద్యుల్లో సైతం నకిలీ వైద్యులు పెరిగిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన తన నివేదికలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ భారత్ని హెచ్చరించింది. మనదేశంలో 2001 లెక్కల ప్రకారం అల్లోపతి డాక్టర్లుగా చలామణి అవుతున్నవారిలో 31 శాతం మంది సెకండరీ పాఠశాల విద్యని మాత్రమే అభ్యసించినవారు. కాగా 57 శాతం మందికి అసలు […]
మనం తింటున్న ఆహారంలో ఈ మధ్య కాలంలో కల్తీ బాగా పెరిగిపోయింది. ఇవే మన ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయనుకుంటే, ఆరోగ్యాన్ని కాపాడే వైద్యుల్లో సైతం నకిలీ వైద్యులు పెరిగిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన తన నివేదికలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ భారత్ని హెచ్చరించింది. మనదేశంలో 2001 లెక్కల ప్రకారం అల్లోపతి డాక్టర్లుగా చలామణి అవుతున్నవారిలో 31 శాతం మంది సెకండరీ పాఠశాల విద్యని మాత్రమే అభ్యసించినవారు. కాగా 57 శాతం మందికి అసలు డాక్టరు డిగ్రీలే లేవు. అంటే సగానికిపైగా వైద్యులు అర్హత లేకుండానే వైద్యం చేసేస్తున్నారన్నమాట.
ఇక గ్రామాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గ్రామాల్లో అర్హులైన అల్లోపతి వైద్యులు 18.8శాతం మంది మాత్రమే ఉన్నారు. అంటే ఎనభైశాతం మంది నకిలీ వైద్యులేనన్నమాట. ఈ విషయంలో మగ డాక్టర్ల కంటే లేడీ డాక్టర్లు నిజాయితీగా ఉండటం గమనార్హం. అల్లోపతి వైద్యుల్లో మగవారు 38శాతం మంది మాత్రమే అర్హత గల వైద్యులు ఉండగా 68శాతం మంది మహిళా వైద్యులు అర్హత గలవారున్నారు.
హెల్త్ వర్క్‌ఫోర్స్ ఇన్ ఇండియా పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తన అధ్యయన వివరాలను ప్రచురించింది. గత ఏడాది కూడా దేశంలో సగం మంది డాక్టర్లు నకిలీ వైద్యులేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. మనదేశంలో ప్రతి లక్షమంది జనాభాకు 80మంది మాత్రమే వైద్యులుండగా అందులో సగం మంది నకిలీ వైద్యులుండటం మరింత దురదృష్టకరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ స్థాయిలో నివేదికలు విడుదల చేస్తున్నా మన కేంద్ర ప్రభుత్వం, అవి ఇంకా అధికారికంగా తమకు చేరలేదంటూ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండటం, నకిలీ వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం మరింత విషాదం.