నాగం నెత్తిన మరో మొట్టికాయ!
నాగం జనార్ధన్ రెడ్డి ఏ ముహూర్తాన కోర్టు గడప తొక్కుతున్నారో గానీ ప్రతిసారీ అక్షింతలే పడుతున్నాయి. తాజాగా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయంటూ న్యాయస్థానంలో పిటిషన్ వేసిన నాగంకు ఈసారి అక్షింతలు భారీగానే పడ్డాయి. అక్షింతలు అనేకంటే మొట్టికాయలు అంటేనే బాగుంటేదేమో! పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టుల అప్పగించారంటూ కోర్టుకెళ్లిన నాగం పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇటీవల ఈప్రాజెక్టులో అక్రమాలు జరిగాయి అనేందుకు అదనపు సమాచారం దొరికింది.. మరోసారి పిటిషన్ వేశారు. […]
BY sarvi18 July 2016 9:27 PM GMT
X
sarvi Updated On: 19 July 2016 12:47 AM GMT
నాగం జనార్ధన్ రెడ్డి ఏ ముహూర్తాన కోర్టు గడప తొక్కుతున్నారో గానీ ప్రతిసారీ అక్షింతలే పడుతున్నాయి. తాజాగా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయంటూ న్యాయస్థానంలో పిటిషన్ వేసిన నాగంకు ఈసారి అక్షింతలు భారీగానే పడ్డాయి. అక్షింతలు అనేకంటే మొట్టికాయలు అంటేనే బాగుంటేదేమో! పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టుల అప్పగించారంటూ కోర్టుకెళ్లిన నాగం పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇటీవల ఈప్రాజెక్టులో అక్రమాలు జరిగాయి అనేందుకు అదనపు సమాచారం దొరికింది.. మరోసారి పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు తీవ్రంగా మండిపడింది. మరోసారి అదనపు సమాచారం ఉందంటూ తప్పుడూ పిటిషన్ వేస్తారా? అని పిటిషన్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈవిషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. పాపం! నాగం జనార్దన్ రెడ్డి ప్రస్తుతానికి ఆయన టైమ్ బాగోలేనట్టుగా ఉంది.
తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఆయన ఏ పని మొదలుపెట్టినా.. మొదటికే మోసం వస్తోది. టీడీపీ నుంచి బయటికి వచ్చిన ఆయన తొలుత బీజేపీలో చేరాడు.. అక్కడ కిషన్ రెడ్డితో పడక ఏడాదిపాటు పార్టీకి దూరంగా ఉన్నాడు. తెలంగాణ బచావో పేరిట ఓ వేదిక పెట్టుకున్నాడు. అదీ కూడా నడవకపోవడంతో చివరికి బీజేపీలోనే కొనసాగుతున్నారు. అయితే,, పార్టీ ఆదేశించిందో.. లేకుంటే తన వ్యక్తిగత ఆసక్తో తెలియదుగానీ.. తెలంగాణ సర్కారు అవినీతికి పాల్పడుతోందని ఎలాగైనా నిరూపించాలని ఆయన కంకణం కట్టుకున్నాడు. ఈ క్రమంలో తొలుత ఎర్రగడ్డ ఆసుపత్రి తరలింపును వ్యతిరేకిస్తూ.. హైకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని కోర్టు కొట్టివేసింది. ఇటీవల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అక్రమాలు జరుగుతున్నాయంటూ నాగం వేసిన పిల్‌ను కోర్టు తోసిపుచ్చింది. అదనపు సమాచారం ఉందంటూ అదే పిటిషన్‌ను ఇటీవల మళ్లీ వేశాడు. ఈసారీ కూడా కోర్టు దాన్నీ తిరస్కరించింది. మొత్తానికి ఆయన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ఎన్ని ఆయుధాలు ప్రయోగించినా.. అవన్నీతుస్సుమంటున్నాయి. కాలం కలిసిరాకపోతే ఇలాగే ఉంటుంది.
Next Story