Telugu Global
Cinema & Entertainment

మరో షెడ్యూల్ ఫిక్స్ చేసిన మెగాస్టార్

చిరంజీవి 150వ సినిమా కత్తిలాంటోడు ప్రాజెక్టుపై ఈ 2 రోజుల్లో చాలా పుకార్లు వినిపించాయి. మొదట జరిగిన షెడ్యూల్ లో చాలా సన్నివేశాలు చిరంజీవికి నచ్చలేదని, వాటిని రీషూట్ చేయాల్సిందిగా వినాయక్ కు ఆదేశించాడని ప్రచారం జరిగింది. మరోవైపు హీరోయిన్, విలన్ ఎవ్వరూ డిసైడ్ అవ్వకపోవడంతో… సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ను క్యాన్సిల్ చేసినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ వదంతులన్నింటికీ చెక్ పెడుతూ… చిరు 150వ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ డీటెయిల్స్ ను యూనిట్ […]

మరో షెడ్యూల్ ఫిక్స్ చేసిన మెగాస్టార్
X
చిరంజీవి 150వ సినిమా కత్తిలాంటోడు ప్రాజెక్టుపై ఈ 2 రోజుల్లో చాలా పుకార్లు వినిపించాయి. మొదట జరిగిన షెడ్యూల్ లో చాలా సన్నివేశాలు చిరంజీవికి నచ్చలేదని, వాటిని రీషూట్ చేయాల్సిందిగా వినాయక్ కు ఆదేశించాడని ప్రచారం జరిగింది. మరోవైపు హీరోయిన్, విలన్ ఎవ్వరూ డిసైడ్ అవ్వకపోవడంతో… సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ను క్యాన్సిల్ చేసినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ వదంతులన్నింటికీ చెక్ పెడుతూ… చిరు 150వ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ డీటెయిల్స్ ను యూనిట్ బయటపెట్టింది. రేపట్నుంచే చిరంజీవి సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభమౌతుంది. హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా షూటింగ్ కు ప్లాన్ చేశారు. అయితే ఎక్కడ షూటింగ్ జరగబోతుందనే విషయాన్ని మేకర్స్ గోప్యంగా ఉంచారు. తాజా సమాచారం ప్రకారం… హైదరాబాద్ శివార్లలోని పంటపొలాల్లో రైతులతో చిరంజీవి సమావేశమయ్యే సన్నివేశాల్ని చిత్రీకరిస్తారని తెలుస్తోంది.
మరోవైపు చిరంజీవి సరసన నటించే హీరోయిన్ కోసం వేట కొనసాగుతూనే ఉంది. యూనిట్ నుంచి ప్రత్యేకంగా కొందరు సభ్యుల్ని ఈ పనిమీద నియమించారు. హీరోయిన్ తో పాటు విలన్ ను వెదికే పని కూడా వీళ్లకు అప్పగించారు. నిజానికి 150వ సినిమాలో విలన్ గా జగపతిబాబును అనుకున్నప్పటికీ… ఈ విషయంపై యూనిట్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
First Published:  19 July 2016 10:50 AM IST
Next Story