గుండెపోటును తప్పించే ఇమ్యునోథెరపీ
వ్యాధి నిరోధక చికిత్స (ఇమ్యునోథెరపీ)ను అందించడం ద్వారా కీళ్లవాతం రోగుల్లో గుండెపోటు ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. శరీరంలోని ఆరోగ్యకర కణాలపై వ్యాధి నిరోధక వ్యవస్థ అసాధారణంగా దాడి చేయడమే ఈ సమస్యకు అసలు కారణంగా గుర్తించారు. ఇలాంటి రోగులను కీళ్లవాపులు, నొప్పులు తీవ్రంగా బాధిస్తుంటాయి. వీరికి హృదయ సంబంధమైన సమస్యలు తలెత్తడం కూడా ఎక్కువేనని పరిశోధకులు గుర్తించారు. రష్యాలోని వొల్లోగార్డ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఎయిదా బబీవా ఈ వ్యాధిపై […]
BY sarvi19 July 2016 2:30 AM IST
X
sarvi Updated On: 20 July 2016 5:52 AM IST
వ్యాధి నిరోధక చికిత్స (ఇమ్యునోథెరపీ)ను అందించడం ద్వారా కీళ్లవాతం రోగుల్లో గుండెపోటు ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. శరీరంలోని ఆరోగ్యకర కణాలపై వ్యాధి నిరోధక వ్యవస్థ అసాధారణంగా దాడి చేయడమే ఈ సమస్యకు అసలు కారణంగా గుర్తించారు. ఇలాంటి రోగులను కీళ్లవాపులు, నొప్పులు తీవ్రంగా బాధిస్తుంటాయి. వీరికి హృదయ సంబంధమైన సమస్యలు తలెత్తడం కూడా ఎక్కువేనని పరిశోధకులు గుర్తించారు. రష్యాలోని వొల్లోగార్డ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఎయిదా బబీవా ఈ వ్యాధిపై పరిశోధన సాగించారు. ఇందులో భాగంగా 68 మంది రోగులను నిత్యం పరీక్షించారు. వ్యాధి నిరోధక కణాల్లోని టీఎన్ ఎఫ్ఐ (ట్యూమర్ నెక్రోసిస్ ఫాక్టర్-అల్ఫా), ఐఎఫ్ ఎన్ ( ఇంటర్ ఫెరో-గామ) అనే మాంసకృత్తులు ఇందుకు కారణమవుతున్నట్టు గుర్తించారు. వీటిని సైటోకీనులు అంటారు. వీటిలో తక్కువ మోతాదులో ప్రతిరక్షక ప్రొటీన్లను చొప్పిస్తే కీళ్ల వాత చికిత్స మరింత మెరుగవుతుందని గుర్తించారు. దీనివల్ల గుండెపోటు ముప్పు కూడా తగ్గుముఖం పడుతుందని పరిశోధకులు గుర్తించారు.
Next Story