స్వాములూ... ముందు మీరు తేల్చుకోండి
శాస్త్రం ఒక్కటే. కానీ అది వ్యక్తి వ్యక్తికి మారడం ఆశ్చర్యంగా ఉంది. పుష్కరాల విషయంలోనూ స్వామీజీలు, పీఠాధిపతులు ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. అందులో ఏది నిజమో తేల్చుకోలేక జనం తికమకపడుతున్నారు. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం కృష్ణ పుష్కరాల వేళ గోదావరి నీటిని తెచ్చి కృష్ణా నదిలో కలుపుతోంది. దీనిపై వివాదం చెలరేగింది. కృష్ణ నదిలోకి గోదావరి నీటిని తెచ్చి కలిపితే అవి కృష్ణపుష్కరాలు ఎలా అవుతాయని కొందరి వాదన. గోదావరి నీటిని తెచ్చి కలపడం వల్ల […]
శాస్త్రం ఒక్కటే. కానీ అది వ్యక్తి వ్యక్తికి మారడం ఆశ్చర్యంగా ఉంది. పుష్కరాల విషయంలోనూ స్వామీజీలు, పీఠాధిపతులు ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. అందులో ఏది నిజమో తేల్చుకోలేక జనం తికమకపడుతున్నారు. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం కృష్ణ పుష్కరాల వేళ గోదావరి నీటిని తెచ్చి కృష్ణా నదిలో కలుపుతోంది. దీనిపై వివాదం చెలరేగింది. కృష్ణ నదిలోకి గోదావరి నీటిని తెచ్చి కలిపితే అవి కృష్ణపుష్కరాలు ఎలా అవుతాయని కొందరి వాదన.
గోదావరి నీటిని తెచ్చి కలపడం వల్ల కృష్ణ పుష్కరాల పవిత్రత దెబ్బతింటుందని కాబట్టి అలా చేయడం సరికాదని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి లాంటి వారు చెబుతున్నారు. కాబట్టి పుష్కరాల వేళ నదీ సంగమం సరికాదని స్వరూపానందేంద్ర వాదన. అయితే ఆదివారం మరో స్వామీజి… కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మరోలా స్పందించారు. కృష్ణలో గోదావరి కలవడం మంచిదేనని సెలవిచ్చారు. మరో నది నీటిని కలపడంతో తప్పు లేదని చెప్పారు. గత గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు తమతో కలిసే స్నానం చేశారని జయేంద్ర సరస్వతి గుర్తు చేసుకున్నారు.
మొత్తం మీద పుష్కరాల వేళ ఒక నది నీటిని మరో నదిలో కలపడంపై శాస్త్రం ఏం చెబుతోందో గానీ.. స్వాములు మాత్రం తమ అభిప్రాయాలే శాస్త్రం అన్నట్టు ప్రకటన చేయడం సరికాదేమో!. స్వాములకే ఇలాంటి భిన్నాభిప్రాయాలు ఉండడం వల్ల మొత్తం శాస్త్రంపైనే జనానికి నమ్మకం తగ్గే అవకాశం ఉంటుంది.
Click on Image to Read: