టీడీపీ ఆరిపోయే దీపం... 2019వరకు ఓర్పుగా పోరాడాలి
టీడీపీ ఆరిపోయే దీపమని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. టీడీపీ పెట్టే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. 2019లో జగన్ సీఎం అవడం ఖాయమని అంతవరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓర్పుతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల్లో ప్రజలు చీకొట్టినా గాలి ముద్దుకృష్ణమనాయుడికి బుద్ది రాలేదని విమర్శించారు. జనం తిరస్కరించారన్న అక్కసుతోనే వైసీపీ నేతలపై గాలి దాడులు చేయిస్తున్నారని అన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమంగా ఎస్సీఎస్టీ కేసులు పెట్టించిన ఘనత గాలికే దక్కుతుందన్నారు. ఎన్ని అక్రమ కేసులు […]

టీడీపీ ఆరిపోయే దీపమని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. టీడీపీ పెట్టే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. 2019లో జగన్ సీఎం అవడం ఖాయమని అంతవరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓర్పుతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల్లో ప్రజలు చీకొట్టినా గాలి ముద్దుకృష్ణమనాయుడికి బుద్ది రాలేదని విమర్శించారు.
జనం తిరస్కరించారన్న అక్కసుతోనే వైసీపీ నేతలపై గాలి దాడులు చేయిస్తున్నారని అన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమంగా ఎస్సీఎస్టీ కేసులు పెట్టించిన ఘనత గాలికే దక్కుతుందన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కేజే కుమార్ కుటుంబం, నాయకులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రెండేళ్ల క్రితం గంగమ్మ జాతరలో ఎమ్మెల్యే అయిన తనపైనే దాడి జరిగినా ఇప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోలేదని రోజా విమర్శించారు. నగిరి పట్టణ పరిధిలోని సీవీఆర్ కళ్యాణ మండపంలో ఆర్కే రోజా అధ్యక్షతన నియోజకవర్గ వైసీపీ విస్రృత స్థాయి సమావేశం జరిగింది.
Click on Image to Read: