కబాలి డైరెక్టర్ కు రజనీ కాంత్ వార్నింగ్..!
కబాలి సినిమాను అల్రేడి రజనీకాంత్ చూశారా..? అవునని కోలీవుడ్ లో ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ సినిమా షూట్ పూర్తి అయిన తరువాత రజనీకాంత్ ఒక్కరే కబాలి షోను తిలికించినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం చూసిన తరువాత రజనికాంత్ ఎలా స్పందిస్తారో అని దర్శకుడు టెన్షన్ లో ఉన్నారట. అయితే రజనీ సాబ్ మాత్రం.. రంజిత్ ను పక్కన కూర్చోబెట్టుకుని.. కబాలిగా సినిమా గొప్పగా చేశావు అని భుజం తట్టారట. దీంతో దర్శకుడు రంజిత్ ఖుషి అయినట్లు […]
BY sarvi18 July 2016 5:01 AM IST
X
sarvi Updated On: 18 July 2016 5:20 AM IST
కబాలి సినిమాను అల్రేడి రజనీకాంత్ చూశారా..? అవునని కోలీవుడ్ లో ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ సినిమా షూట్ పూర్తి అయిన తరువాత రజనీకాంత్ ఒక్కరే కబాలి షోను తిలికించినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం చూసిన తరువాత రజనికాంత్ ఎలా స్పందిస్తారో అని దర్శకుడు టెన్షన్ లో ఉన్నారట. అయితే రజనీ సాబ్ మాత్రం.. రంజిత్ ను పక్కన కూర్చోబెట్టుకుని.. కబాలిగా సినిమా గొప్పగా చేశావు అని భుజం తట్టారట. దీంతో దర్శకుడు రంజిత్ ఖుషి అయినట్లు తెలుస్తుంది.
అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాల నిడివి కట్ చేస్తే బావుంటుందని సౌందర్య రజనికాంత్ సూచించారట. అయితే ఈ విషయంలో కూడా రజనీకాంత్ దర్శకుడికి ఫైనల్ వర్డ్ ఇచ్చేశారట. సినిమా ఇలాగే ఉండాలి. ఎవరు నిన్ను ఒత్తిడి చేసినా ఒక్క కట్ కూడ చేయొద్దని చెప్పారట. ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. దాదాపు 10 వేల స్క్రీన్స్ లో కబాలి ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది.
Click on Image to Read:
Next Story