బీచ్ సాంగ్ లో నయనతార సెగలు..!
ఎంత మంది కొత్త హీరోయిన్స్ వస్తున్నప్పటికి నయనతారను బీట్ చేయడం కష్టమే. తెలుగులో లక్ష్మీ చిత్రంతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ తిరుగులేని హీరోయినే అని చెప్పాలి. వెంకటేష్, బాలయ్య, నాగార్జున, విక్రమ్ వంటి సీనియర్ హీరోలతో పాటు.. ఎన్టీఆర్, ఉదయనిధి స్టాలిన్ వంటి యంగర్ హీరోస్ తో కూడా జత కట్టి మెప్పించిన నయన ప్రస్తుతం సౌత్ బిజీ హీరోయిన్స్ లో నెంబర్ వన్ అని చెప్పాలి. తాజాగా విక్రమ్ తమిళ్ లో చేస్తున్న […]
BY sarvi18 July 2016 5:10 AM IST

X
sarvi Updated On: 18 July 2016 5:46 AM IST
ఎంత మంది కొత్త హీరోయిన్స్ వస్తున్నప్పటికి నయనతారను బీట్ చేయడం కష్టమే. తెలుగులో లక్ష్మీ చిత్రంతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ తిరుగులేని హీరోయినే అని చెప్పాలి. వెంకటేష్, బాలయ్య, నాగార్జున, విక్రమ్ వంటి సీనియర్ హీరోలతో పాటు.. ఎన్టీఆర్, ఉదయనిధి స్టాలిన్ వంటి యంగర్ హీరోస్ తో కూడా జత కట్టి మెప్పించిన నయన ప్రస్తుతం సౌత్ బిజీ హీరోయిన్స్ లో నెంబర్ వన్ అని చెప్పాలి.
తాజాగా విక్రమ్ తమిళ్ లో చేస్తున్న ఇరువర్ చిత్రంలో ఇటీవల బీచ్‌లో ఓ సాంగ్‌ని షూట్ చేశాడు డైరెక్టర్ ఆనంద్ శంకర్. విక్రమ్-నయన్ హాలీడేకి వెళ్ళే సందర్భంలో తెరకెక్కించిన సాంగ్ ఇది.ఇందులో నయన్- విక్రమ్‌ల మధ్య కెమిస్ట్రీ సూపర్బ్ అని అంటోంది యూనిట్. ఈ రేంజ్‌లో ఇప్పటివరకు నయన నటించలేదని, కొత్తగా కనిపిస్తోందని చెబుతోంది. మరోవైపు టూరిస్ట్ స్పాట్ అయినా, షూటింగ్‌కు ఏ మాత్రం ఇబ్బంది తలెత్తకుండా అధికారుల అనుమతితో చిత్రీకరించాడు డైరెక్టర్. మరో హీరోయిన్ నిత్యామీనన్ కీలకమైన రోల్ చేయనుంది. అంతా అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 1న మూవీని రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచన.



Next Story