లేజర్ ట్రీట్‌మెంట్‌తో.... క్యాన్సర్ ప్రమాదం!
లేజర్ ట్రీట్మెంట్ ద్వారా శరీరం మీది అవాంఛిత, అనవసరమైన వెంట్రుకలను తొలగించుకునే వారికి ఓ హెచ్చరిక చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇది క్యాన్సర్ కారకం కావచ్చంటున్నారు. లేజర్ హెయిర్ రిమూవల్ యంత్రాలను వాడేవారు అందులో శిక్షణ తీసుకోకపోయినా, దానికి సంబంధించిన పరికరాలు, సదుపాయాలు సక్రమంగా లేకపోయినా, దాన్ని వినియోగిస్తున్నవారికి, ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నవారికి… ఇద్దరికీ ఆరోగ్య హాని ఉంటుందని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన డాక్టర్ గారీ చుంగ్ అన్నారు. లేజర్ హెయిర్ రిమూవల్ చికిత్స తీసుకుంటున్నపుడు వెంట్రుకలు కాలటం వలన […]
లేజర్ ట్రీట్మెంట్ ద్వారా శరీరం మీది అవాంఛిత, అనవసరమైన వెంట్రుకలను తొలగించుకునే వారికి ఓ హెచ్చరిక చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇది క్యాన్సర్ కారకం కావచ్చంటున్నారు. లేజర్ హెయిర్ రిమూవల్ యంత్రాలను వాడేవారు అందులో శిక్షణ తీసుకోకపోయినా, దానికి సంబంధించిన పరికరాలు, సదుపాయాలు సక్రమంగా లేకపోయినా, దాన్ని వినియోగిస్తున్నవారికి, ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నవారికి… ఇద్దరికీ ఆరోగ్య హాని ఉంటుందని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన డాక్టర్ గారీ చుంగ్ అన్నారు.
లేజర్ హెయిర్ రిమూవల్ చికిత్స తీసుకుంటున్నపుడు వెంట్రుకలు కాలటం వలన వచ్చే పొగలో క్యాన్సర్ కారకాలు ఉంటాయని గారీ అంటున్నారు. గాలిని ఫిల్టర్ చేసే విధానం, పొగని తొలగించే సదుపాయాలు సక్రమంగా లేకుండా పరికరాలను వినియోగిస్తే దానివలన హాని ఉంటుందని ఆ శాస్త్రవేత్త హెచ్చరిస్తున్నారు. అరగంటపాటు లేజర్ ట్రీట్మెంట్ చేయగా వెలువడిన తుంపర్లనుండి గాల్లోకి 377 రసాయన సమ్మేళనాలు కలుస్తున్నట్టుగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇందులో 20 వాతావరణాన్ని కాలుష్యం చేసే కార్బన్డయాక్సైడ్ లాంటి విష పదార్థాలు కాగా, 13 క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నపుడు విడుదల అయ్యే పొగ, కాలుష్యాల్లో జీవులను హాని చేసే రసాయనాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటినుండి తప్పించుకోవాలంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్నపుడు చక్కని గాలి లోపలికి ప్రవేశించే పరిసరాలు, పొగని నిర్మూలించే సదుపాయాలు, శ్వాసవ్యవస్థకు రక్షణ చర్యలు తప్పనిసరి అని వారు సలహా ఇస్తున్నారు.