నేను కడుపుతో ఉండటం...జాతీయ విపత్తు కాదు " కరీనా కపూర్!
తన ప్రెగ్నెన్సీ వార్తపై చిలవలు పలవలుగా కథనాలు వండి వారుస్తున్న మీడియాపై కరీనా కపూర్ తీవ్రంగా మండిపడింది. ఈ నెల రెండోతేదీన సైఫ్ అలీఖాన్, కరీనా కడుపుతో ఉన్నదని చెప్పిన తరువాత ఆమె కెరీర్‌కి రాబోతున్న విరామంపై, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై మీడియా విస్తృతంగా చర్చించడం మొదలుపెట్టింది. కరీనా డెలివరీ డేట్ డిసెంబరులో ఉండటంతో ఆమె సోనమ్ కపూర్‌తో నటిస్తున్న సినిమాను, కొన్ని మ్యాగజైన్ల కవర్ల తాలూకూ చిత్రీకరణను అక్టోబరుతో పూర్తి చేసి ఇక వీటన్నింటికీ దూరంగా […]
తన ప్రెగ్నెన్సీ వార్తపై చిలవలు పలవలుగా కథనాలు వండి వారుస్తున్న మీడియాపై కరీనా కపూర్ తీవ్రంగా మండిపడింది. ఈ నెల రెండోతేదీన సైఫ్ అలీఖాన్, కరీనా కడుపుతో ఉన్నదని చెప్పిన తరువాత ఆమె కెరీర్‌కి రాబోతున్న విరామంపై, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై మీడియా విస్తృతంగా చర్చించడం మొదలుపెట్టింది. కరీనా డెలివరీ డేట్ డిసెంబరులో ఉండటంతో ఆమె సోనమ్ కపూర్‌తో నటిస్తున్న సినిమాను, కొన్ని మ్యాగజైన్ల కవర్ల తాలూకూ చిత్రీకరణను అక్టోబరుతో పూర్తి చేసి ఇక వీటన్నింటికీ దూరంగా విశ్రాంతి తీసుకుంటుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తానేమీ మాట్లాడకుండానే, తన మనోభావాలేమిటో తెలుసుకోకుండానే ఇలాంటి కథనాలు రావటంపై కరీనా చాలా చిరాగ్గా ఉందని తెలుస్తోంది.
ఆమె దీనిపై ఎంత విసిగిపోయిందో ఆమె మాటలే చెబుతున్నాయి. నేను ప్రెగ్నెంట్‌ని…దీన్ని ఒకరకమైన మరణం అన్నంతగా మీడియా ప్రచారం చేస్తోంది..అసలు మాతృత్వపు విరామం అనే ప్రశ్న ఎందుకు వస్తోంది….ఈ భూమ్మీద ప్రతి మహిళకు ఇది సర్వసాధారణమైన విషయం. మీడియా నన్ను ప్రత్యేకంగా చూడాల్సిన పనిలేదు…నేను ఇదివరకటి మనిషినే….అంటోందామె. నాతో ఇబ్బంది ఉన్నవారు పనిచేయరు…కానీ నేను పనిచేస్తూనే ఉంటాను…నా ప్రెగ్నెన్సీని ఒక జాతీయ విపత్తేమో అన్నట్టుగా చూడకండి అంటూ ఆమె మీడియాకు చురకలు అంటించింది. మనం 2016లో ఉన్నాం…1800ల్లో కాదు, నిజానికి అప్పటివారే ఎంతో నాగరికంగా ప్రవర్తించారు… ఇప్పుడు మీడియా చేస్తున్న అనవసరపు యాగీ అప్పుడు లేదని అంటూ…తనకు ఈ ప్రచారం చాలా విసుగు తెప్పిస్తోందని, ఇదేదో ఒక రకమైన మరణం అన్నంతగా చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పెళ్లి, పిల్లలు… కెరీర్‌కి అడ్డుకాదనే సందేశాన్ని తాను ఇవ్వాలనుకుంటున్నానని ఆమె తెలిపింది. ఆమె రానున్న నెలల్లో తాను ప్రచారకర్తగా ఉన్న ఉత్పత్తుల తాలూకూ ప్రకటనల చిత్రీకరణని పూర్తి చేయనుంది. తనను ప్రచారకర్తగా తీసుకున్న వారంతా తన భావాలు, టాలెంట్ పట్ల ఆనందంగా ఉన్నారని కరీనా కపూర్ పేర్కొంది.