కృష్ణ డైలాగ్‌ను నేరుగా వినిపించే సరికి గొట్టిపాటి ఏమన్నారంటే...
”ఈనాడు” చిత్రంలో పార్టీ ఫిరాయింపులపై ఒక సన్నివేశంలో కృష్ణ పవర్ ఫుల్ డైలాగ్ ఒకటి ఉంటుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపులు ఎక్కువైన నేపథ్యంలో ఆ డైలాగ్ యమ పాపులర్ అయింది. సోషల్ మీడియాలో తెగచక్కర్లుకొడుతోంది. పార్టీ ఫిరాయించే ప్రజాప్రతినిధులను వ్యభిచారులతో పోల్చి డైలాగ్ చెబుతారు కృష్ణ. ఆ డైలాగ్ క్లిప్పింగ్‌ను ఒక టీవీ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూలో నేరుగా ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు వినిపించారు. ఆ వీడియో చూస్తున్నంత సేపు గొట్టి పాటి ముఖంలో […]
”ఈనాడు” చిత్రంలో పార్టీ ఫిరాయింపులపై ఒక సన్నివేశంలో కృష్ణ పవర్ ఫుల్ డైలాగ్ ఒకటి ఉంటుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపులు ఎక్కువైన నేపథ్యంలో ఆ డైలాగ్ యమ పాపులర్ అయింది. సోషల్ మీడియాలో తెగచక్కర్లుకొడుతోంది. పార్టీ ఫిరాయించే ప్రజాప్రతినిధులను వ్యభిచారులతో పోల్చి డైలాగ్ చెబుతారు కృష్ణ. ఆ డైలాగ్ క్లిప్పింగ్‌ను ఒక టీవీ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూలో నేరుగా ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు వినిపించారు. ఆ వీడియో చూస్తున్నంత సేపు గొట్టి పాటి ముఖంలో ఫీలింగ్స్ మారిపోయాయి.
ఈ డైలాగ్ విన్న తర్వాత ఒక ఫిరాయింపు ఎమ్మెల్యేగా ఏమనిపిస్తోందని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా…వెంటనే తేరుకుని సినిమాలు వేరు నిజ జీవితం వేరు అని గొట్టిపాటి సమాధానం చెప్పారు. ఒక విధంగా రాజకీయాల్లో పార్టీ ఫిరాయించడం తప్పు కాదని సమర్దించుకున్నారు. ప్రజల కోసమే తాను పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. పార్టీ మారాల్సిన పరిస్థితులు వైసీపీలో తలెత్తాయన్నారు. కేసులకు భయపడి చంద్రబాబు వెనకాల తాను దాక్కోలేదన్నారు. కేవలం తన వాళ్లను కాపాడుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. మనిషనేవాడు ఇలాగా కూడా ఉంటాడా… ఇంత దారుణంగా మనుషులను చంపుతాడా అనేందుకు కరణం బలరామే నిదర్శనమన్నారు. అతడి పేరు కూడా తన నోటితో ఉచ్చరించనన్నారు. తన అన్న కిషోర్‌ను అతి కిరాతకంగా చంపి పొలాల్లో పాతిపెట్టిన విషయం అందరికీ తెలుసన్నారు. కరణం బలరాం ఒక దుర్మార్గుడన్నారు. మంత్రి పదవి కోసం రూ. 30 కోట్లు ఇచ్చేందుకు తాను ప్రయత్నించడం లేదన్నారు. 2019లో టీడీపీ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున అద్దంకి నుంచి పోటీ చేసేది తానేనని ప్రకటించుకున్నారు గొట్టిపాటి.
Click on Image to Read: