10 లక్షలకు కొంటే.. పాతిక కోట్లు వచ్చాయ్... లాభం అంటే ఇది...!
టాలీవుడ్ లో ఈ రెండేళ్లలో ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడిన అత్యధిక శాతం లాభం సంపాదించిన సినిమా ఏంటో తెలుసా… ఈ లిస్ట్ లో చిరంజీవి, బన్నీ, పవన్, మహేష్ సినిమాలేవీ లేవు. బాహుబలి సినిమా కూడా ఆ స్థాయిలో లాభాలు ఆర్జించలేదంటే నమ్మాల్సిందే. అలా కళ్లుతిరిగే లాభాలు కళ్లజూసిన సినిమా బిచ్చగాడు. అవును… కేవలం 10లక్షల రూపాయలతో కొన్న ఈ సినిమా పాతి కోట్లు సంపాదించింది. ఇంకా సంపాదిస్తూనే ఉంది. ఇఁత ఎక్కువ శాతం లాభాలు బాహుబలికి […]
టాలీవుడ్ లో ఈ రెండేళ్లలో ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడిన అత్యధిక శాతం లాభం సంపాదించిన సినిమా ఏంటో తెలుసా… ఈ లిస్ట్ లో చిరంజీవి, బన్నీ, పవన్, మహేష్ సినిమాలేవీ లేవు. బాహుబలి సినిమా కూడా ఆ స్థాయిలో లాభాలు ఆర్జించలేదంటే నమ్మాల్సిందే. అలా కళ్లుతిరిగే లాభాలు కళ్లజూసిన సినిమా బిచ్చగాడు. అవును… కేవలం 10లక్షల రూపాయలతో కొన్న ఈ సినిమా పాతి కోట్లు సంపాదించింది. ఇంకా సంపాదిస్తూనే ఉంది. ఇఁత ఎక్కువ శాతం లాభాలు బాహుబలికి కూడా రాలేదని ట్రేడ్ పండిట్స్ విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా వంద రోజులు దిశగా దూసుకుపోతోంది.
శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’ ను తెలుగులో ‘బిచ్చగాడు’ అనే పేరుతో చదలవాడ పద్మావతి మే 13న విడుదల చేశారు. ఈ చిత్రం 63 రోజులను పూర్తి చేసుకుని దిగ్విజయంగా వందరోజుల వేడుకను జరుపుకునే దిశగా వెళుతుంది. ఆంద్రాలో 10,87,33,270/-, నైజాంలో 7,35,19,804/-, సీడెడ్ లో 6,85,67,673/ రూపాయలతో మొత్తంగా ఇప్పటికే ఈ చిత్రం 25 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇంకా సినిమా 70 శాతం ఆక్యుపెన్సీతో రన్ అవుతుందోని నిర్మాతలు అంటున్నారు. ఇదే ఊపు కొనసాగితే… 30-35 కోట్ల రూపాయల వసూళ్లను సాధిస్తామని అంటున్నారు.