బెజవాడ ఫ్లైఓవర్‌లో పక్కకు ఒరిగిన పిల్లర్ చువ్వలు
విజయవాడలో నిర్మిస్తున్న దుర్గ ఫ్లైఓవర్ పనుల్లో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పిల్లర్ నిర్మాణం కోసం వేసిన ఇనుప చువ్వల బాక్స్ ఒకపక్కకు ఒరిగిపోయింది. ఇనుప చువ్వల మీద కాంక్రీట్ వర్క్ చేసే సమయంలో ఈ ఘటన జరిగిందని కథనాలు వస్తున్నాయి. బేస్‌మెంట్ సరిగ్గా వేయకపోవడం వల్లే ఈప్రమాదం జరిగిందని కథనాలు వస్తున్నాయి. ఈ ఘటన జరిగిన వెంటనే మరమ్మతులు వేగవంతం చేశారు. ఇనుప చుక్కలు ఒరిగిపోయిన నేపథ్యంలో ఫైఓవర్ నాణ్యతపై విజయవాడవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. […]
విజయవాడలో నిర్మిస్తున్న దుర్గ ఫ్లైఓవర్ పనుల్లో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పిల్లర్ నిర్మాణం కోసం వేసిన ఇనుప చువ్వల బాక్స్ ఒకపక్కకు ఒరిగిపోయింది. ఇనుప చువ్వల మీద కాంక్రీట్ వర్క్ చేసే సమయంలో ఈ ఘటన జరిగిందని కథనాలు వస్తున్నాయి. బేస్‌మెంట్ సరిగ్గా వేయకపోవడం వల్లే ఈప్రమాదం జరిగిందని కథనాలు వస్తున్నాయి. ఈ ఘటన జరిగిన వెంటనే మరమ్మతులు వేగవంతం చేశారు. ఇనుప చుక్కలు ఒరిగిపోయిన నేపథ్యంలో ఫైఓవర్ నాణ్యతపై విజయవాడవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సిబ్బంది మాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు. జరిగింది చిన్న ప్రమాదమేనంటున్నారు. లోపం ఎక్కడుందన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.
వెలగపూడిలోని సచివాలయంలో ప్లోర్ కూలడం అప్పట్లో కలకలం రేపింది. కొద్ది రోజుల క్రితం పుష్కరాల కోసం నిర్మిస్తున్న దుర్గాఘాట్ లో కాంక్రీట్ నిర్మాణానికి భారీగా పగుళ్లు రావడం కూడా ఆందోళన కలిగించింది. తాజాగా చిన్న ప్రమాదం అయినప్పటికీ ఫైఓవర్ ఇనుప చువ్వల నిర్మాణం ఒరిగిపోవడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా నిర్మాణంపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.
Click on Image to Read: