మరుగుదొడ్లు కడిగిన రాంచరణ్ మామ!
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. తన పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లోని మరుగుదొడ్లు కడిగారు. కడగటం అంటే ఏదో ఫొటోలకు ఫోజులివ్వడం కాదు. నిజంగానే శుభ్రంగా కడిగారు. విశ్వేశ్వర్ రెడ్డి అంటే చాలామందికి చేవెళ్ల ఎంపీగానే పరిచయం. కానీ, ఆయన రాంచరణ్‌కు మామ అవుతారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయన తోడల్లుడి కూతురునే మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ ప్రేమవివాహం చేసుకున్నారు. విశ్వేశ్వర్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో […]
BY sarvi16 July 2016 12:42 AM GMT
X
sarvi Updated On: 16 July 2016 2:18 AM GMT
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. తన పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లోని మరుగుదొడ్లు కడిగారు. కడగటం అంటే ఏదో ఫొటోలకు ఫోజులివ్వడం కాదు. నిజంగానే శుభ్రంగా కడిగారు. విశ్వేశ్వర్ రెడ్డి అంటే చాలామందికి చేవెళ్ల ఎంపీగానే పరిచయం. కానీ, ఆయన రాంచరణ్‌కు మామ అవుతారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయన తోడల్లుడి కూతురునే మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ ప్రేమవివాహం చేసుకున్నారు. విశ్వేశ్వర్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసేవారు.
కొందరికి వార్డు మెంబర్‌గా ఎన్నికైతేనే ఎక్కడలేని గర్వం తలకెక్కుతుంది. అలాంటిది విశ్వేశ్వర్ ఒక ఎంపీగా ఇలాంటి కార్యక్రమాలతో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన ఒక శాస్ర్తవేత్త, ఎంతో జ్ఞానం ఉన్న విద్యావేత్త. ఐరోపా, అమెరికాలో పలు విశ్వవిద్యాలయాల్లో డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి విజిటింగ్ ప్రొఫెసర్. విద్యార్థులంటే ఆయనకు ఎంతో ఇష్టం. పాఠాలు చెప్పడం అంటే తగని మక్కువ. అందుకే తన పరిశోధనలు కొనసాగిస్తూనే.. విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఆయన తాత కొండా వెంకట రంగారెడ్డి తెలంగాణ స్వాతంత్ర్య సమర యోధుడు. తరువాత ఉమ్మడి ఏపీలో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు హైదరాబాద్ పక్కన ఉన్న రంగారెడ్డి జిల్లాకు ఆయన పేరే పెట్టారు.
ఆయన 2014 ఎన్నికల సమయంలోనూ విశ్వేశ్వర్ రెడ్డి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. తెలుగు సినీపరిశ్రమలో ఉన్న అల్లు అర్జున్, రాంచరణ్‌లతో బంధుత్వం ఉండటంతో వారు కూడా ప్రచారం చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ, వారిపై ఆధారపడలేదు విశ్వేశ్వర్ రెడ్డి. ఆయన సతీమణికే పూర్తి ప్రచార బాధ్యతలు అప్పగించారు. వేలకోట్ల ఆస్తులు ఉన్నా.. విద్యార్థుల మరుగుదొడ్లు కడిగి తన ఉదారవాదాన్ని మరోసారి చాటుకున్నారు.
Next Story