శ్రియ పెళ్లి కూతురైన వేళ...!
నటిగా సినిమాల్లో హీరోయిన్స్ ఎన్నో సార్లు పెళ్లి కూతుర్లు అవుతుంటారు. అయితే అది జస్ట్ యాక్టింగే అని తెలిసినా…. ఒక్కోసారి ఆ గెటప్స్ తెగ నచ్చేస్తాయి. ఇలా శ్రియకు నచ్చిన ఒక గెటప్ ఇలా చేసేసింది. ఈ ఫొటోలోని నటి శ్రియని చూడండి. 1980 కాలంనాటి పెళ్లి కూతురులా తయారై ఎంత చక్కగా ఉన్నారో కదా. ప్రస్తుతం ఆమె తమిళ నటుడు శింబుతో కలిసి ‘ఎఎఎ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్లో భాగంగా శ్రియ ఇలా […]
BY sarvi15 July 2016 7:44 AM IST
X
sarvi Updated On: 15 July 2016 7:53 AM IST
నటిగా సినిమాల్లో హీరోయిన్స్ ఎన్నో సార్లు పెళ్లి కూతుర్లు అవుతుంటారు. అయితే అది జస్ట్ యాక్టింగే అని తెలిసినా…. ఒక్కోసారి ఆ గెటప్స్ తెగ నచ్చేస్తాయి. ఇలా శ్రియకు నచ్చిన ఒక గెటప్ ఇలా చేసేసింది.
ఈ ఫొటోలోని నటి శ్రియని చూడండి. 1980 కాలంనాటి పెళ్లి కూతురులా తయారై ఎంత చక్కగా ఉన్నారో కదా. ప్రస్తుతం ఆమె తమిళ నటుడు శింబుతో కలిసి ‘ఎఎఎ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్లో భాగంగా శ్రియ ఇలా పెళ్లికూతురి గెటప్‌లో తయారయ్యారట. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ.. సెట్లో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘ఎఎఎ’ సినిమాలో పెళ్లికూతురు, 2016లో 1980 అని ట్వీట్ చేశారు.ఈ చిత్రంలో శ్రియ సెల్వీ అనే పాత్రను పోషిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ , కేరళలో జరుగుతున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద శ్రియ 1980 నాటి పెళ్లికూతురు డ్రెస్ లో మురిసిపోయిందినమాట.
Next Story