Telugu Global
National

సెక్సియస్ట్‌ క్వశ్చన్ పై సానియాకు సారీ చెప్పిన రాజ్‌దీప్

టెన్నిస్‌ సార్ట్ సానియా మీర్జాకు ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ క్షమాపణ చెప్పారు. సానియాను ఇబ్బంది పెట్టేలా ఒక ప్రశ్న అడగడంతో ఆమె కాస్త ఘాటుగా స్పందించారు. దీంతో వెంటనే హుందాగా క్షమాపణ చెప్పారు రాజ్‌ దీప్‌. తన క్రీడా ప్రస్థానంపై ‘ఏస్ అగెనెస్ట్ ఆడ్స్’ పేరిట ఆమె రాసుకున్న పుస్తకాన్ని హైదరాబాద్‌లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఆవిష్కరించారు. ఈ పుస్తక ప్రమోషన్‌లో భాగంగా ఆమె పలు టీవీ ఛానెళ్లకు ఇంటర్యూలు ఇచ్చారు. రాజ్ దీప్ […]

సెక్సియస్ట్‌ క్వశ్చన్ పై  సానియాకు సారీ చెప్పిన రాజ్‌దీప్
X

టెన్నిస్‌ సార్ట్ సానియా మీర్జాకు ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ క్షమాపణ చెప్పారు. సానియాను ఇబ్బంది పెట్టేలా ఒక ప్రశ్న అడగడంతో ఆమె కాస్త ఘాటుగా స్పందించారు. దీంతో వెంటనే హుందాగా క్షమాపణ చెప్పారు రాజ్‌ దీప్‌. తన క్రీడా ప్రస్థానంపై ‘ఏస్ అగెనెస్ట్ ఆడ్స్’ పేరిట ఆమె రాసుకున్న పుస్తకాన్ని హైదరాబాద్‌లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఆవిష్కరించారు. ఈ పుస్తక ప్రమోషన్‌లో భాగంగా ఆమె పలు టీవీ ఛానెళ్లకు ఇంటర్యూలు ఇచ్చారు. రాజ్ దీప్ సర్దేశాయ్ కూడా ఒక ఛానల్‌ తరపున ఇంటర్వ్యూ చేశారు. కేరీర్‌ గురించి ప్రశ్నలు అడిగిన తర్వాత జీవితంలో ఎప్పుడు సెటిల్‌ అవుతున్నారు?. తల్లితనం సంగతేంటని ప్రశ్నించారు. దీంతో సానియా చిన్నబుచ్చుకుంది.

మీ ప్రశ్న నన్ను చాలా నిరాశపరిచింది. ఇలాంటి ప్రశ్నలు మహిళలకే ఎదురవుతాయి. వాటిని ఫేస్ చేయాల్సి వస్తోంది. దురదృష్టవశాత్తు పెళ్లి ఆ తర్వాత పిల్లలు అన్న ప్రేమ్‌లో సెటిల్‌ అయిపోయాం అని వ్యాఖ్యానించారు. మాతృత్వం ఎప్పుడు? అని అడిగే ముందు తాను సాధించిన టైటిళ్లు కనిపించడం లేదా? అని ఎదురు ప్రశ్నించారు. దీంతో రాజ్‌దీప్ వెంటనే తేరుకున్నారు.

ఈ ప్రశ్న వేసినందుకు చాలా చింతిస్తున్నాను. క్షమించండి అని అన్నారు. ‘మీకు వేసిన ప్రశ్నలను నేను ఇప్పటిదాకా ఏ పురుష క్రీడాకారుడికి వేయలేదు. తప్పు చేశాను. మన్నించండి” అంటూ హుందాగా క్షమాపణ కోరారు. దీంతో సానియా కూడా పాజిటివ్‌గా స్పందించారు. నా జీవితంలో తొలిసారిగా ఒక నేషనల్ మీడియా ప్రతినిధితో సారీ చెప్పించుకోగలిగాను అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అందుకు సంతోషంగా ఉందంటూ చమత్కరించారు. అనంతరం ఇంటర్వ్యూకొనసాగింది.

Click on Image to Read:

srivani

11212

Digvijaya-Singh-transfers-p

babu-lokesh

ambati

chandrababu-modi

eenadu-story

sabbam-hari

r-vidyasagar-rao

babu-movie

vangaveeti-radha-comments-o

ysrcp1

Parthasarathy

sonia-gandhi

kejriwal1

chandrababu-naidu

sujay-krishna-ranga-rao

ys-jagan

First Published:  15 July 2016 9:41 AM IST
Next Story