చంద్రబాబు హామీలు రేవంత్ ఇచ్చేస్తాడా?
ఓటుకునోటు కేసు తరువాత టీడీపీలో రేవంత్ రెడ్డికి ప్రాధాన్యం అమాంతంగా పెరిగిపోయింది. పార్టీ పరువు మాత్రం గంగలో కలిసిపోయింది. అయినా..నవ్విపోదురు గాక.. అన్న రీతిలో వ్యవహరిస్తున్నాడు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. ఈ మధ్య పార్టీలో ఒంటెత్తుపోకడలు పోతున్నాడన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి. దీనికితోడు పార్టీలోని సీనియర్ నేతల మాటలను అస్సలు వినడం లేదన్న గుసగుసలు కూడా ఎక్కువయ్యాయి. ఇటీవల ఈ విషయంపై చంద్రబాబు కుమారుడు లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఏపీలో చంద్రబాబు కులాల కుంపటి రాజేస్తే.. తెలంగాణలో […]
BY sarvi14 July 2016 9:00 PM GMT
X
sarvi Updated On: 15 July 2016 12:12 AM GMT
ఓటుకునోటు కేసు తరువాత టీడీపీలో రేవంత్ రెడ్డికి ప్రాధాన్యం అమాంతంగా పెరిగిపోయింది. పార్టీ పరువు మాత్రం గంగలో కలిసిపోయింది. అయినా..నవ్విపోదురు గాక.. అన్న రీతిలో వ్యవహరిస్తున్నాడు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. ఈ మధ్య పార్టీలో ఒంటెత్తుపోకడలు పోతున్నాడన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి. దీనికితోడు పార్టీలోని సీనియర్ నేతల మాటలను అస్సలు వినడం లేదన్న గుసగుసలు కూడా ఎక్కువయ్యాయి. ఇటీవల ఈ విషయంపై చంద్రబాబు కుమారుడు లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఏపీలో చంద్రబాబు కులాల కుంపటి రాజేస్తే.. తెలంగాణలో ఆ తేనెతెట్టును తానే కదిపేందుకు సిద్ధమవుతున్నాడు రేవంత్ రెడ్డి.
తెలుగు రాష్ర్టాల్లో దళితులను కులాల వారీగా విభజించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ నేతృత్వంలో మరోసారి ఉద్యమానికి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మందకృష్ణ టీడీపీ మద్దతు కోరారు. దీనిపై ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో మంద కృష్ణ మాదిగ, టీడీపీనేతలతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దీనిపై చంద్రబాబు నాయుడితో మాట్లాడి ఆయన నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని చెబుతాడు.. అని అనుకున్నారంతా.. కానీ అలా జరగలేదు. మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయినా.. చంద్రబాబు ఓకే అనకుండానే ఈయన హామీ ఎలా ఇస్తారు? అని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. ఎంత అధినేతకు దగ్గరి నేత అయితే మాత్రం ఆయనను సంప్రదించకముందే.. ఇలాంటి హామీలుఇవ్వడమేంటని చర్చించుకుంటున్నారు.
ఇప్పటికే ఏపీలో కులాల మధ్య కుంపటి రాజేసిన టీడీపీ తెలంగాణలోనూ అదే బాటలో పయనిస్తున్నట్లుగా ఉంది. ఈ సమస్య కారణంగా ఏపీలో ఓసీ-బీసీల మధ్య అంతరం పెరిగిపోయింది. గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో టీడీపీకి సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది. చంద్రబాబుహయాంలో చేసిన ఎస్సీ రిజర్వేషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టిపారేసింది. ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేల పార్టీ పిరాయింపుల కారణంగా ఇప్పటికే తెలంగాణలో పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. కనీసం ఎస్సీ రిజర్వేషన్ల వల్లనైనా తిరిగి లైమ్ లైట్‌లోకి వద్దామనుకుంటున్నారేమో!
Next Story