Telugu Global
NEWS

చెవిరెడ్డి బయటకు... కేజే కుమార్‌ లోపలికి

చంద్రబాబు సొంత జిల్లాలో పోలీసులు బాగానే స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా వైసీపీ నేతలను తీసుకెళ్లి లోపలేస్తున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డిని కేవలం రెండు రోజుల వ్యవధిలోనే మూడుసార్లు అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆయనకు కాస్త విరామమిచ్చి మరొకరిపై పడ్డారు. చెవిరెడ్డి బెయిల్‌పై విడుదలై బయటకు రాగానే వైసీపీ ప్రధాన కార్యదర్శి, నగరి మున్సిపల్ మాజీ చైర్మన్‌ కేజే కుమార్‌ను పట్టుకెళ్లారు. 10 రోజుల క్రితం పాత ఆస్పత్రి వద్ద కేజే కుమార్… తనకు అడ్డుపడ్డారని టీడీపీ […]

చెవిరెడ్డి బయటకు... కేజే కుమార్‌ లోపలికి
X

చంద్రబాబు సొంత జిల్లాలో పోలీసులు బాగానే స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా వైసీపీ నేతలను తీసుకెళ్లి లోపలేస్తున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డిని కేవలం రెండు రోజుల వ్యవధిలోనే మూడుసార్లు అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆయనకు కాస్త విరామమిచ్చి మరొకరిపై పడ్డారు. చెవిరెడ్డి బెయిల్‌పై విడుదలై బయటకు రాగానే వైసీపీ ప్రధాన కార్యదర్శి, నగరి మున్సిపల్ మాజీ చైర్మన్‌ కేజే కుమార్‌ను పట్టుకెళ్లారు.

nagari municipal ex chairman kj kumar arrest10 రోజుల క్రితం పాత ఆస్పత్రి వద్ద కేజే కుమార్… తనకు అడ్డుపడ్డారని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఫిర్యాదు చేయగా… పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. భోజనం చేసి వస్తానని కేజే కుమార్‌ కోరినా పోలీసులు మాత్రం లెక్కచేయకుండా తీసుకెళ్లారు. కేజే కుమారుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా వారికి రెండువారాల రిమాండ్ విధించింది.

పది రోజుల క్రితం నగరిలో రంజాన్‌ తోఫాను మున్సిపల్ చైర్‌పర్సన్ కేజే శాంతి రాకముందే పంపిణి చేశారు. దీనికి ఆమెతో పాటు వైసీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. గాయపడిన శాంతిని ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ గాలిని ఘెరావ్ చేశారు. దీంతో ఆయన మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త కేజేకుమార్, ఆమె కుమారుడు మురళిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Click on Image to Read –

r-vidyasagar-rao

ysrcp1

babu-movie

ys-jagan-yatra

buggana-rajendranath-reddy

chandrababu-naidu

chandrababu-psyco

vijaya-sai-reddy

buggana-rajendranath-reddy

sujay-krishna-ranga-rao

babu-rank

ys-jagan-undavalli

ys-jagan

undavalli-harsha-kumar

kavitha-on-chandrababu

kcr-hero-krishna

dhoni-love-story

mla-srikanth-reddy

gattamaneni

babu-comedy

kcr harita haram

tdp-naidu

bhuma-gangula

Palle-Raghunatha-Reddy

jagan-gottipati

amaravathi-chandrababu-naid

lokesh-focus-on-teachers

First Published:  14 July 2016 3:32 AM IST
Next Story