హాస్పిటల్ లో చేరిన కమల్... కొత్త సినిమా పరిస్థితి ఏంటి..?
లోకనాయకుడు కమల్ హాసన్ ఊహించని విధంగా అస్వస్థతకు గురయ్యారు. తన ఆఫీస్ లో మెట్లు దిగుతూ కాలుజారి పడిన కమల్ ను… హుటాహుటిన చెన్నైలోని అపోలో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కమల్ ను పరీక్షించిన వైద్యులు… అతడి కాలికి చిన్న ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించారు. కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోక తప్పదని సూచించారు. కమల్ గాయపడ్డంతో అతనికి సంబంధించిన షెడ్యూల్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. అందులో మొదటిది లండన్ లో జరగనున్న లండన్ ఇండియన్ […]
BY sarvi14 July 2016 2:34 PM IST
X
sarvi Updated On: 14 July 2016 2:46 PM IST
లోకనాయకుడు కమల్ హాసన్ ఊహించని విధంగా అస్వస్థతకు గురయ్యారు. తన ఆఫీస్ లో మెట్లు దిగుతూ కాలుజారి పడిన కమల్ ను… హుటాహుటిన చెన్నైలోని అపోలో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కమల్ ను పరీక్షించిన వైద్యులు… అతడి కాలికి చిన్న ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించారు. కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోక తప్పదని సూచించారు.
కమల్ గాయపడ్డంతో అతనికి సంబంధించిన షెడ్యూల్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. అందులో మొదటిది లండన్ లో జరగనున్న లండన్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్. వాస్తవానికి ఈ చిత్రోత్సవానికి కమల్ హాసనే ముఖ్య అతిథి. ఏర్పాట్లు అన్నీ జరిగిపోయాయి. కమల్ కు ఫ్లయిట్ టికెట్లు కూడా అందిపోయాయి. ఇదే వేదికపై లైఫ్ టైం ఎఛీవ్ మెంట్ అవార్డు కూడా అందుకోవాల్సి ఉంది కమల్. కానీ కాలికి దెబ్బతగలడంతో కమల్ ఈ ఈవెంట్ కు హాజరుకావడం లేదు.
ఇక ప్రస్తుతం కమల్ చేస్తున్న త్రిభాషా చిత్రం శభాష్ నాయుడు సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదని మేకర్స్ ప్రకటించారు. ఎఁదుకంటే ఇప్పటికే భారీ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా… ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉంది. మరికొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత హైదరాబాద్ లోనే మరో షెడ్యూల్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. గాయం చిన్నదే కాబట్టి.. ఈ గ్యాప్ లో కమల్ కచ్చితంగా కోలుకుంటాడు.
Next Story