జ్ఞాపకశక్తిని చక్కగా పెంచే...దాల్చిన చెక్క!
దాల్చిన చెక్కలో ఉన్న ఔషధ గుణాలు ఇప్పటికే చాలా పరిశోధనల్లో వెల్లడయ్యాయి. ఇప్పుడు మరొక తాజా అధ్యయనంలో తేలిన సంగతులను బట్టి దాల్చిన చెక్క ఏదైనా కొత్తవిషయాలను నేర్చుకునేవారికి ఎంతగానో సహకరిస్తుంది. మనశరీరంలో పంచేంద్రియాల ద్వారా గ్రహించే సమాచారాన్ని మెదడులో హిపోకమస్ అనే భాగం క్రమబద్ధీకరించి, భద్రపరుస్తుంది. ఈ ప్రక్రియలో పాల్గొనే మాంసకృత్తుల పేరు సీఆర్ఈబి. అంటే ఎవరిలో అయితే ఈ మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయో వారిలో సమాచార సేకరణ, జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటాయి. దాల్చిన చెక్కని […]
దాల్చిన చెక్కలో ఉన్న ఔషధ గుణాలు ఇప్పటికే చాలా పరిశోధనల్లో వెల్లడయ్యాయి. ఇప్పుడు మరొక తాజా అధ్యయనంలో తేలిన సంగతులను బట్టి దాల్చిన చెక్క ఏదైనా కొత్తవిషయాలను నేర్చుకునేవారికి ఎంతగానో సహకరిస్తుంది. మనశరీరంలో పంచేంద్రియాల ద్వారా గ్రహించే సమాచారాన్ని మెదడులో హిపోకమస్ అనే భాగం క్రమబద్ధీకరించి, భద్రపరుస్తుంది. ఈ ప్రక్రియలో పాల్గొనే మాంసకృత్తుల పేరు సీఆర్ఈబి. అంటే ఎవరిలో అయితే ఈ మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయో వారిలో సమాచార సేకరణ, జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటాయి.
దాల్చిన చెక్కని ఆహారంలో తీసుకోవటం వలన మెదడులో సీఆర్ఈబి ప్రొటీస్లు పెరుగుతాయని పరిశోధకులు కనుగొన్నారు. మెదళ్లు మొద్దుబారిన ఎలుకలను దాల్చిన చెక్కను ప్రతిరోజూ ఆహారంతో పాటు ఇచ్చి చూశారు. దాంతో వాటి జీవ రసాయన క్రియల్లోనూ, మెదడు కణాల నిర్మాణంలోనూ మార్పు వచ్చి, సీఆర్ఈబి ప్రొటీన్లు పెరిగాయి. అంతేకాక జ్ఞాపకశక్తిని తగ్గించే ఆల్ఫా5 అనే ప్రొటీన్ తగ్గటం కూడా గమనించారు. దాల్చిన చక్కని ఆహారంలో తీసుకున్నఆ ఎలుకలు కొద్దిరోజుల్లోనే ఉత్సాహంగా మారి, కొత్త విషయాలను సులభంగా గ్రహించడం మొదలుపెట్టాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అమెరికాలోని రుష్ విశ్వవిద్యాలయ ఆసుపత్రికి చెందిన నాడీ విభాగ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేసి వివరాలు వెల్లడించారు.