ఐటీ బాబును అవమానించేలా "ఈనాడు" కథనం
చంద్రబాబు ఏ మీటింగ్‌కు వెళ్లినా ఎక్కువ సేపు ఐటీ గురించే మాట్లాడుతుంటారు. తానే లేకుంటే తెలుగు ప్రజలకు ఐటీ గురించే తెలిసేది కాదని చెబుతుంటారు. తన దయ వల్లే సెల్‌ఫోన్లు కూడా వచ్చాయని మీటింగ్‌లో బహిరంగంగానే చెప్పుకుంటుంటారు. సాంకేతిక విప్లవాన్ని పరుగులు పెట్టించాలన్నా, టెక్నాలజీని మాగ్జిమమ్ వాడేయాలన్నా ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమన్న ఫీలింగ్ కలిగిస్తుంటారు. అయితే గురువారం ఈనాడు పత్రిక ప్రముఖంగా ప్రచురించిన కథనాన్ని చదివితే చాలు.. చంద్రబాబు ఐటీ పాలన ఎలా ఉందో అర్థమవుతుంది. ఐటీని […]
చంద్రబాబు ఏ మీటింగ్‌కు వెళ్లినా ఎక్కువ సేపు ఐటీ గురించే మాట్లాడుతుంటారు. తానే లేకుంటే తెలుగు ప్రజలకు ఐటీ గురించే తెలిసేది కాదని చెబుతుంటారు. తన దయ వల్లే సెల్‌ఫోన్లు కూడా వచ్చాయని మీటింగ్‌లో బహిరంగంగానే చెప్పుకుంటుంటారు. సాంకేతిక విప్లవాన్ని పరుగులు పెట్టించాలన్నా, టెక్నాలజీని మాగ్జిమమ్ వాడేయాలన్నా ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమన్న ఫీలింగ్ కలిగిస్తుంటారు. అయితే గురువారం ఈనాడు పత్రిక ప్రముఖంగా ప్రచురించిన కథనాన్ని చదివితే చాలు.. చంద్రబాబు ఐటీ పాలన ఎలా ఉందో అర్థమవుతుంది.
ఐటీని ఉపయోగించుకుని రాష్ట్రంలోని జనాల పుట్టుపూర్వోత్తరాలను రికార్డ్ చేస్తానంటూ చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా పల్స్ సర్వే చేపట్టారు. దీనిపైనే ఈనాడు కథనం రాసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చంద్రబాబు పల్స్ సర్వేలో పల్స్‌రేటు పడిపోయింది అన్నట్టుగా కథనం ఉంది. చంద్రబాబు ఇంత హడావుడి చేసినా ఇప్పటి వరకు కేవలం మూడు శాతం మంది వివరాలను మాత్రమే సేకరించగలిగారని ఈనాడు తేల్చింది. ఇప్పటి వరకు 25 లక్షల మంది కుటుంబాల వివరాలను సేకరించాలని టార్గెట్ ఉండగా… కేవలం 77 వేల 756 కుటుంబాల వివరాలను మాత్రమే రికార్డు చేశారని వెల్లడించింది. ఈ సర్వే ఇంత దారుణంగా ముందుకు కదలడానికి కారణం కూడా బాబుగారి టెక్నాలజీనే కావడం విశేషం. ఏపీ ప్రభుత్వం టెక్నాలజీ వినియోగంతో ఉరకలేస్తోందని చంద్రబాబు ప్రపంచమంతా తిరిగి చెబుతుంటే… పల్స్ సర్వేలో కనీసం సర్వర్లు కూడా పనిచేయడం లేదు.
ఇమ్యునేటర్ ఒక్కొక్కరు రోజుకు 14 కుటుంబాల వివరాలు రికార్డు చేయాలన్నది టార్గెట్. ఈ లెక్కన రోజుకు 4లక్షల 20వేల కుటుంబాల వివరాలు సేకరించాలి. కానీ ఒక్కో ఇమ్యునేటర్ రోజుకు రెండు కుటుంబాలను కూడా కవర్ చేయలేకపోతున్నారు. ఇమ్యునేటర్‌కు ఇచ్చిన ట్యాప్‌ల చార్జింగ్ కనీసం నాలుగు గంటల పాటు పనిచేయాలి. కానీ ఒక్కో కుటుంబం వివరాలను తీసుకుని వాటిని అప్‌డేట్ చేసేలోపే చార్జింగ్ అయిపోతోంది. తిరిగి చార్జింగ్ ఫుల్ అవడానికి మూడు నాలుగు గంటలు పడుతోంది. పైగా వివరాలన్నీ తీసుకుని వాటిని అప్‌డేట్ బటన్ నొక్కగానే సర్వర్ డౌన్ అవుతోంది. పల్లెల్లో సిగ్నల్స్ లేకపోవడంతో హఠాత్తుగా సర్వర్‌తో కనెక్షన్ కట్ అవుతోంది. ఒక్కో ఇమ్యునేటర్ కిందమీద పడి కేవలం ఒకటి రెండు కుటుంబాల వివరాలను మాత్రమే రికార్డు చేయగలగుతున్నారు. ఐటీ పితామహుడు లాంటి చంద్రబాబు నిర్వహిస్తున్న సర్వేలో ఒక్కో సారి ”క్షమించండి దురదృష్టవశాత్తు స్మార్ట్ పల్స్ సర్వే నిలిపివేయబడింది” అంటూ మేసేజ్ వస్తోంది. దీన్ని చూసి సిబ్బంది షాక్ అవుతున్నారు. ”సర్వే ఆపివేయబడింది” అంటూ వస్తున్న మేసేజ్ తాలుకూ ఫొటోను కూడా ఈనాడు పత్రిక ప్రచురించింది.
అసలు తమ ఊరికి, తమ ఇంటికి సర్వే వాళ్లు ఎప్పుడొస్తారోకూడా తెలియక జనం నానా ఇక్కట్లు పడుతున్నారని ఈనాడు పత్రికే ప్రచురించింది. ఇదే విషయాన్ని తనకు వ్యతిరేకమైన మీడియా ప్రచురించి ఉంటే సర్వేను దెబ్బకొట్టాడానికి కుట్ర చేస్తున్నారని చంద్రబాబుతో పాటు ఆయన బృందం కూడా ఎదురు దాడి చేసేది. కానీ పల్స్ సర్వేలో పల్స్ రేటు లేదన్నట్టుగా ఈనాడే రాసింది. ఇప్పుడేమంటారో?. పక్క రాష్ట్రంలో కేసీఆర్ సమగ్ర సర్వేను ఒకే రోజు స్టేట్ మొత్తం నిర్వహించి విజయవంతమయ్యారు. చంద్రబాబు మాత్రం విఫలమైనట్టుగానే ఉన్నారు. పనితీరు ఇలా ఉన్నప్పుడు చంద్రబాబుకు మోదీ 13 వ ర్యాంకు ఇవ్వడంలో ఆశ్చర్యం ఏముంటుంది.
Click on Image to Read –