నేను 3వేల కోట్లంటే... లేదు 5వేల కోట్లన్న బాబు ఎక్కడ?
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులతో బుధవారం వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు. లోటు లోటు అంటూనే చంద్రబాబు విమానాల్లో తిరుగుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు విమానాల్లో విదేశాలకు వెళ్లడం మాని ఇక్కడి రైతుల పరిస్థితిపై దృష్టి పెట్టాలని సూచించారు. వైఎస్ హయంలో పొగాకుకు కనీసం రూ.165 మద్దతు ధర ఉంటే. .చంద్రబాబు 114 రూపాయలకు తీసుకొచ్చారని విమర్శించారు. పామాయిల్‌కు వైఎస్ఆర్ హయాంలో రూ.10 వేలు పలికితే, ఇప్పుడు రూ.5,500కి పడిపోయిందన్నారు. గతంలో తాను […]
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులతో బుధవారం వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు. లోటు లోటు అంటూనే చంద్రబాబు విమానాల్లో తిరుగుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు విమానాల్లో విదేశాలకు వెళ్లడం మాని ఇక్కడి రైతుల పరిస్థితిపై దృష్టి పెట్టాలని సూచించారు. వైఎస్ హయంలో పొగాకుకు కనీసం రూ.165 మద్దతు ధర ఉంటే. .చంద్రబాబు 114 రూపాయలకు తీసుకొచ్చారని విమర్శించారు.
పామాయిల్‌కు వైఎస్ఆర్ హయాంలో రూ.10 వేలు పలికితే, ఇప్పుడు రూ.5,500కి పడిపోయిందన్నారు. గతంలో తాను ఎన్నికల సమయంలో రైతుల కోసం మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని చెబితే… చంద్రబాబు పోటీగా 5000కోట్లతో స్థిరీకరణ నిధి పెడుతానన్నారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
పట్టిసీమ నిర్వాసితులకు ఎకరాకు 30లక్షల నష్టపరిహారం ఇచ్చిన చంద్రబాబు… చింతలపల్లి ప్రాజెక్ట్ రైతులకు మాత్రం రూ.12లక్షలే ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. రైతుల మధ్య గొడవ పెట్టి ప్రాజెక్టులు కట్టకుండా దాటివేయడమే చంద్రబాబు ఉద్దేశమని ఆరోపించారు. మోసాలు చేస్తున్న చంద్రబాబును నిలదీయాలని అప్పుడే వ్యవస్థకు మంచి జరుగుతుందన్నారు. తప్పుడు వాగ్దానాలు ఇస్తే జనం తిరగబడుతారన్న భయం నేతలకు కలిగేలా చేయాలన్నారు. జనం నిలదీయకపోతే వచ్చే ఎన్నికల్లో ఇంటికో కారు కొనిస్తానని కూడా చంద్రబాబు చెబుతారని జగన్ అన్నారు.
Click on Image to Read –