Telugu Global
Cinema & Entertainment

గుట్టు విప్పిన త‌మ‌న్నా..!

త‌ము బేబి అంటే కెరీర్ లో ఎత్తు ప‌ల్లాలు చూసిన హీరోయిన్. కెరీర్ ప్రారంభం టాలీవుడ్ లో స్టార్ట్ అయిన‌.. స్టార్ హీరోయిన్ గా స‌క్సెస్ ఇచ్చింది మాత్రం కోలీవుడ్ అనే చెప్పాలి. ఆ త‌రువాత ద‌ర్శ‌కుడు సుకుమార్ తో చేసిన హండ్రెట్ ప‌ర్సెంట్ ల‌వ్ అనే చిత్రం టాలీవుడ్ లో త‌మ‌న్నా కు ఆఫ‌ర్ల వ‌ర్షం కురిపించింది. ఒక్క సారిగా క‌మ‌ర్షియ‌ల్ స్టార్ హీరోస్ అంతా త‌మ‌న్నానే త‌మ స‌ర‌స‌న బెస్ట్ హీరోయిన్ అన్న‌ట్లు తీసుకున్నారు. […]

గుట్టు విప్పిన త‌మ‌న్నా..!
X

త‌ము బేబి అంటే కెరీర్ లో ఎత్తు ప‌ల్లాలు చూసిన హీరోయిన్. కెరీర్ ప్రారంభం టాలీవుడ్ లో స్టార్ట్ అయిన‌.. స్టార్ హీరోయిన్ గా స‌క్సెస్ ఇచ్చింది మాత్రం కోలీవుడ్ అనే చెప్పాలి. ఆ త‌రువాత ద‌ర్శ‌కుడు సుకుమార్ తో చేసిన హండ్రెట్ ప‌ర్సెంట్ ల‌వ్ అనే చిత్రం టాలీవుడ్ లో త‌మ‌న్నా కు ఆఫ‌ర్ల వ‌ర్షం కురిపించింది. ఒక్క సారిగా క‌మ‌ర్షియ‌ల్ స్టార్ హీరోస్ అంతా త‌మ‌న్నానే త‌మ స‌ర‌స‌న బెస్ట్ హీరోయిన్ అన్న‌ట్లు తీసుకున్నారు. ఆ వ‌ర‌స‌లో కొన్ని ఫెయిల్యూర్స్ ప‌డ్డాయి. ఆ త‌రువాత బాహుబ‌లి చిత్రం మ‌ళ్లీ ఘ‌న విజ‌యం ఇవ్వ‌డంతో.. త‌మ‌న్నా కెరీర్ ప్ర‌స్తుతానికి సాఫిగా సాగుతుంది.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు త‌న ఫ‌స్ట్ ప్ర‌యార్టి అనేది క‌థ‌ల‌కే ఇచ్చింద‌ట‌. క‌థ విన్న త‌రువాత‌నే సినిమాలో యాక్ట్ చేయాలా లేదా అనేది చెబుతుంద‌ట‌. క‌థ విన‌కుండా ఎస్ చెప్ప‌డం అనేది జ‌ర‌గ‌నే జ‌ర‌గ‌ద‌ట‌. ఈ వ్యూహం త‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు మంచి రిజ‌ల్టే ఇచ్చింద‌ట‌. ప్ర‌స్తుతం బాహుబ‌లి ది క‌న్ క్లూజ‌న్.. అభినేత్రి అనే భారీ ప్రాజెక్ట్ లు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌.

First Published:  13 July 2016 7:02 AM IST
Next Story