సదావర్తికి గ్రీన్ సిగ్నల్... బుగ్గనకు రెడ్ సిగ్నల్
హైకోర్టులో మంగళవారం రెండు కీలకమైన కేసులు విచారణకు వచ్చాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సదావర్తి భూకుంభకోణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. తమిళనాడులో ఎకరం 10 కోట్లు పలుకుతున్న సదావర్తి సత్రం భూములను చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఎకరం 27లక్షలకే టీడీపీ నేతలకు కట్టబెట్టింది. దీనిపై వైసీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాలు అన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. క్షేత్రస్థాయి పరిశీలన చేసి దాదాపు వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని సీపీఐ నారాయణ లాంటి వారుకూడా ఆరోపించారు. […]
హైకోర్టులో మంగళవారం రెండు కీలకమైన కేసులు విచారణకు వచ్చాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సదావర్తి భూకుంభకోణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. తమిళనాడులో ఎకరం 10 కోట్లు పలుకుతున్న సదావర్తి సత్రం భూములను చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఎకరం 27లక్షలకే టీడీపీ నేతలకు కట్టబెట్టింది. దీనిపై వైసీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాలు అన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. క్షేత్రస్థాయి పరిశీలన చేసి దాదాపు వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని సీపీఐ నారాయణ లాంటి వారుకూడా ఆరోపించారు. ఈ వేలాన్ని వ్యతిరేకిస్తూ బ్రాహ్మణ సమాఖ్య యువజన విభాగం అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.దీనిపై విచారణ జరిపిన తాత్కాలిక చీఫ్ జస్టిస్ దిలీప్ బి బోసేలే పిటిషన్‌ను కొట్టివేశారు. తాము అన్ని నిబంధనలు పాటించిన తర్వాతే వేలం పాట నిర్వహించామన్న ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.
మరోవైపు గాలేరు – నగరి వరద కాలువ నిర్మాణంలో వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మరికొందరి రైతుల భూములను తీసుకునే వ్యవహారంపైన హైకోర్టులో విచారణ జరిగింది. 1927 నుంచి తమ ఆధీనంలో ఉన్న భూములను ప్రభుత్వ భూములు అంటూ రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ విడుదల చేయడంపై బుగ్గన, మరికొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో తుది తీర్పు వచ్చే వరకు భూమి స్వాధీనం చేసుకోవద్దంటూ ఇదివరకు హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే మంగళవారం ఆ స్టేను ఎత్తివేసింది. దీంతో కొద్ది కాలంగా వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుటుంబం భూములను లాక్కునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న మంత్రి దేవినేని ఉమా లక్ష్యం నెరవేరినట్టైంది. అయితే దీనిపై అప్పీల్‌కు వెళ్తామని బుగ్గన, ఇతర బాధితులు చెబుతున్నారు.
1927 నుంచి బుగ్గన, ఇతరుల కుటుంబాలు కర్నూలు జిల్లా చెర్వుపల్లి వద్ద భూమిని సాగుచేసుకుంటున్నాయి. 1940దశకంలో పంటల ఉత్పత్తిని పెంచడంలో భాగంగా అప్పటి ప్రభుత్వాలు సాగు భూములపై హక్కులను సాగుచేసుకుంటున్న వారికే అప్పగించింది. అయితే ఆ భూములను ప్రభుత్వ భూములుగా చూపి నష్టపరిహారం కూడా చెల్లించకుండానే ప్రభుత్వం తీసుకోనుంది. అయినా కోర్టుల్లో చంద్రబాబును జయించడం సాధ్యమయ్యే పనేనా?.
Click on Image to Read –