విశ్రాంతి కోరుకుంటున్న సమంత
కొద్ది మందికి మాత్రమే జీవితంలో అనుకున్నవి దొరుకుతాయి. అటువంటి వారిలో నేనొకర్ని అంటోంది అందాల సమంత. చిన్నప్పుడు ప్రతిరోజు కొత్తగా వుంటే బావుండు అని అనుకునేదట. అయితే సినిమా నటి అయిన తరువాత ప్రారంభంలో కొంత కాలం మాత్రం అవకాశాల కోసం వెయిట్ చేసిందట. ఆ తరవాత షార్ట్ టైమ్ లోనే తను ఊహించిన దానికంటే ఎక్కువుగా తన లైఫ్ లో మార్పులు జరిగాయి. అవన్నీ తనకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి అంటోంది. కొద్ది కాలంలోనే స్టార్ […]

కొద్ది మందికి మాత్రమే జీవితంలో అనుకున్నవి దొరుకుతాయి. అటువంటి వారిలో నేనొకర్ని అంటోంది అందాల సమంత. చిన్నప్పుడు ప్రతిరోజు కొత్తగా వుంటే బావుండు అని అనుకునేదట. అయితే సినిమా నటి అయిన తరువాత ప్రారంభంలో కొంత కాలం మాత్రం అవకాశాల కోసం వెయిట్ చేసిందట. ఆ తరవాత షార్ట్ టైమ్ లోనే తను ఊహించిన దానికంటే ఎక్కువుగా తన లైఫ్ లో మార్పులు జరిగాయి. అవన్నీ తనకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి అంటోంది. కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ అన్నారు. ఆ తరువాత సీనియర్ అంటున్నారు. దీంతో తన పై బాధ్య త పెరిగిందని ఫీల్ అవుతుందట. అందుకే ఇప్పుడు ఆచి తూచి చిత్రాలు ఎంచుకున్నట్లు సమంత చెబుతుంది. ప్రస్తుతం జనాత గ్యారేజ్ చిత్రం ఒక్కటే చేస్తుందట. ఈ సినిమా తరువాత కొంత కాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తుందట. నిజమే సమంత లవ్ విషయంలో కూడా అన్నీ త్వరత్వరగానే జరుగుతున్నట్లున్నాయంటున్నారు గాసిప్ రాయుళ్లు.