Telugu Global
Cinema & Entertainment

చెర్రీ సినిమాలో కూడా 4 పాటలే ఉంటాయట...

ఈమధ్యే బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు సంబంధించి ఓ వార్త విన్నాం. అదేంటంటే… సినిమాలో కేవలం 4 పాటలు మాత్రమే ఉంటాయని. మిగతావన్నీ పద్యాల రూపంలో ఉంటాయనే ప్రచారం నడిచింది. సినిమా కథను సూటిగా సుత్తిలేకుండా చెప్పే క్రమంలో… పాటల్ని తగ్గించేశారని తెలుస్తోంది. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకు కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. కథ, స్క్రీన్ ప్లేలో బిగి చెడిపోకుండా ఉండేందుకు… చెర్రీ నటిస్తున్న ధ్రువ సినిమాలో కూడా పాటల్ని కుదించేశారట. తాజా […]

చెర్రీ సినిమాలో కూడా 4 పాటలే ఉంటాయట...
X

ఈమధ్యే బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు సంబంధించి ఓ వార్త విన్నాం. అదేంటంటే… సినిమాలో కేవలం 4 పాటలు మాత్రమే ఉంటాయని. మిగతావన్నీ పద్యాల రూపంలో ఉంటాయనే ప్రచారం నడిచింది. సినిమా కథను సూటిగా సుత్తిలేకుండా చెప్పే క్రమంలో… పాటల్ని తగ్గించేశారని తెలుస్తోంది. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకు కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. కథ, స్క్రీన్ ప్లేలో బిగి చెడిపోకుండా ఉండేందుకు… చెర్రీ నటిస్తున్న ధ్రువ సినిమాలో కూడా పాటల్ని కుదించేశారట. తాజా సమాచారం ప్రకారం.. ధ్రువ సినిమాలో కూడా 4 పాటలే ఉంటాయంటున్నారు. వీటిలో ఒకటి మాస్ మసాలా పాట అయితే… ఇంకోటి హీరోయిన్ తో వచ్చే డ్యూయట్ సాంగ్ అట. మిగిలిన 2 పాటలు బ్యాక్ గ్రౌండ్ లోనే ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయంటున్నారు. కేవలం స్క్రీన్ ప్లేలో పట్టు కోల్పోకుండా ఉండేందుకే సురేందర్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే చెర్రీ మాత్రం అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని, మరో 2 పాటల్ని చొప్పించే ప్రయత్నం చేస్తున్నాడట. ప్రస్తుతానికైతే థ్రువ సినిమాలో పాటలు నాలుగే. త్వరలోనే చెర్రీ కోరిక మేరకు మరో 2 పాటలు అదనంగా చేరే అవకాశం ఉంది. ఈ సినిమాలో చెర్రీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. అరవింద్ స్వామి విలన్ గా కనిపించనున్నాడు.

First Published:  12 July 2016 5:00 AM IST
Next Story