పందెం రాయుళ్లు పారిపోయారు...లాకప్ లో కోడిపుంజు!
తాము పందాలలో పాల్గొంటే చట్టాలు ఒప్పుకోవని పాపం కోడిపుంజులకు తెలియదు కదా…అందుకే పోలీసులు రాగానే కోళ్లపందాలు నిర్వహిస్తున్న వారంతా పారిపోయారు కానీ ఒక కోడిపుంజు మాత్రం అక్కడే ఉండిపోయింది. దాంతో పోలీసులు దాన్నే తెచ్చి లాకప్లో పెట్టారు. ఖమ్మంలో ఈ వింత చోటుచేసుకుంది. పందాల నిర్వహణ గురించి పోలీసులకు సమాచారం అందటంతో వారు అక్కడికి చేరుకున్నారు. వెంటనే పందెం రాయుళ్లంతా పారిపోగా ఒక పుంజుమాత్రం అక్కడే మిగిలిపోయింది. పోలీసులు దాన్ని స్టేషన్కి తీసుకువచ్చి లాకప్లో పెట్టారు. తరువాత […]

తాము పందాలలో పాల్గొంటే చట్టాలు ఒప్పుకోవని పాపం కోడిపుంజులకు తెలియదు కదా…అందుకే పోలీసులు రాగానే కోళ్లపందాలు నిర్వహిస్తున్న వారంతా పారిపోయారు కానీ ఒక కోడిపుంజు మాత్రం అక్కడే ఉండిపోయింది. దాంతో పోలీసులు దాన్నే తెచ్చి లాకప్లో పెట్టారు. ఖమ్మంలో ఈ వింత చోటుచేసుకుంది. పందాల నిర్వహణ గురించి పోలీసులకు సమాచారం అందటంతో వారు అక్కడికి చేరుకున్నారు. వెంటనే పందెం రాయుళ్లంతా పారిపోగా ఒక పుంజుమాత్రం అక్కడే మిగిలిపోయింది. పోలీసులు దాన్ని స్టేషన్కి తీసుకువచ్చి లాకప్లో పెట్టారు. తరువాత ఈ విషయం మీడియాకు తెలియటంతో దాన్ని బయట కట్టేశారు.