Telugu Global
Cinema & Entertainment

కబాలికి లైన్ క్లియర్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ కబాలికి లైన్ క్లియర్ అయింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుంది. సెన్సార్ అధికారులు ఎలాంటి కట్స్ లేకుండా సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమాను ఈనెల 22న గ్రాండ్ గా విడుదల చేయాలనకుుంటున్నారు. ఆ విషయాన్ని రేపోమాపో అధికారికంగా ప్రకటిస్తారు. అయితే కబాలికి తమిళనాట మాత్రమే లైన్ క్లియర్ అయింది. తెలుగులో ఇంకా ఈ సినిమా ఎలాంటి చప్పుడు చేయడం లేదు. కబాలి సినిమా ఈనెల […]

కబాలికి లైన్ క్లియర్
X

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ కబాలికి లైన్ క్లియర్ అయింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుంది. సెన్సార్ అధికారులు ఎలాంటి కట్స్ లేకుండా సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమాను ఈనెల 22న గ్రాండ్ గా విడుదల చేయాలనకుుంటున్నారు. ఆ విషయాన్ని రేపోమాపో అధికారికంగా ప్రకటిస్తారు. అయితే కబాలికి తమిళనాట మాత్రమే లైన్ క్లియర్ అయింది. తెలుగులో ఇంకా ఈ సినిమా ఎలాంటి చప్పుడు చేయడం లేదు. కబాలి సినిమా ఈనెల 22నే తమిళనాట థియేటర్లలోకి వస్తుందనుకున్నా… తెలుగు వెర్షన్ పై మాత్రం ఇంకా అనుమానాలు పోలేదు. ఈ సినిమా ఒకేసారి తమిళ వెర్షన్ తో పాటు తెలుగులో విడుదలయ్యేది అనుమానమే అనేది తాజా రూమర్. ఈ సినిమా తెలుగు రైట్స్ ను పశ్చిమ గోదావరికి జిల్లాకు చెందిన ఓ నిర్మాత… 32 కోట్ల రూపాయలకు దక్కించుకున్నాడు. కానీ సినిమా విడుదల తేదీపై క్లారిటీ రాకపోవడంతో నిర్మాత ఇప్పుడు కుదేలు అవుతున్నాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకోవడంతో, విడుదల తేదీపై స్పష్టత రాకపోవడంతో రిలీజ్ కు ముందే నష్టాలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం…. తమిళ్ తో పాటు తెలుగులో కూడా కబాలిని ఒకేసారి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఒకవేళ.. అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరకనప్పటికీ… అందుబాటులో ఉన్న థియేటర్లతోనే సరిపెట్టుకొని.. ఎలాగైనా కబాలిని అనుకున్న టైమ్ కు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారట.

First Published:  12 July 2016 4:56 AM IST
Next Story