చిరుత వచ్చి పంజా విసిరితే...ఎదురుతిరిగి పోరాడింది!
నిద్రలో ఉన్నపుడు చిన్న శబ్దమైనా ఉలిక్కి పడతాం. గాఢనిద్రలోంచి హఠాత్తుగా లేచినపుడు తాడుని చూసినా పామని భయపడతాం. కానీ ఓ మహిళ మాత్రం, అర్థరాత్రి నిద్రలో ఉండగా చిరుతపులి నేరుగా బెడ్‌రూంలోకి వచ్చి పంజా విసిరినా ధైర్యం కోల్పోలేదు. ఎదురుదాడి చేసి తన ప్రాణాలు కాపాడుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఫిథౌరాగఢ్ జిల్లా, సున్యారాలో ప్రమీలా దేవి అనే మహిళకు ఎదురైన సంఘటన ఇది. అర్థరాత్రి గ్రామంలోకి ప్రవేశించిన చిరుత ఇంట్లోకి దూరి, పై అంతస్తులో నిద్రపోతున్న ప్రమీలా […]

నిద్రలో ఉన్నపుడు చిన్న శబ్దమైనా ఉలిక్కి పడతాం. గాఢనిద్రలోంచి హఠాత్తుగా లేచినపుడు తాడుని చూసినా పామని భయపడతాం. కానీ ఓ మహిళ మాత్రం, అర్థరాత్రి నిద్రలో ఉండగా చిరుతపులి నేరుగా బెడ్‌రూంలోకి వచ్చి పంజా విసిరినా ధైర్యం కోల్పోలేదు. ఎదురుదాడి చేసి తన ప్రాణాలు కాపాడుకుంది.
ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఫిథౌరాగఢ్ జిల్లా, సున్యారాలో ప్రమీలా దేవి అనే మహిళకు ఎదురైన సంఘటన ఇది. అర్థరాత్రి గ్రామంలోకి ప్రవేశించిన చిరుత ఇంట్లోకి దూరి, పై అంతస్తులో నిద్రపోతున్న ప్రమీలా దేవి వద్దకు వెళ్లింది. చిరుత పంజాదెబ్బకు ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచిన ప్రమీలా దేవి, వెంటనే అప్రమత్తమై పక్కనే ఉన్న కర్రతీసుకుని దానిపై దాడికి దిగింది. దాని పంజాదెబ్బలకు గాయాలవుతున్నా, భయపడకుండా దానిపై పోరాడింది. ఈ లోపల కుటుంబ సభ్యులు సైతం లేచి రావటంతో చిరుత అక్కడి నుండి పారిపోయింది. తీవ్రంగా గాయపడిన ప్రమీలా దేవిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.