చంద్రబాబుకు రహస్య ఎజెండా ఉంది
చంద్రబాబు ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ సర్వేపై మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సర్వే చాలా ప్రమాదకరమని అన్నారు. సర్వేలో మొత్తం 25కు పైగా డాక్యుమెంట్లను అడుగుతున్నారని… వాటిని ఇవ్వడం వల్ల భవిష్యత్తులో మన సమాచారమంతా పరాయివాళ్ల చేతుల్లో పడే ప్రమాదం ఉంటుందన్నారు. అప్పుడు తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సర్వేను ప్రజలంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ సర్వే వెనుక చంద్రబాబు రహస్య ఎజెండా ఉందని నాదెండ్ల ఆరోపించారు. […]
చంద్రబాబు ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ సర్వేపై మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సర్వే చాలా ప్రమాదకరమని అన్నారు. సర్వేలో మొత్తం 25కు పైగా డాక్యుమెంట్లను అడుగుతున్నారని… వాటిని ఇవ్వడం వల్ల భవిష్యత్తులో మన సమాచారమంతా పరాయివాళ్ల చేతుల్లో పడే ప్రమాదం ఉంటుందన్నారు. అప్పుడు తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సర్వేను ప్రజలంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ సర్వే వెనుక చంద్రబాబు రహస్య ఎజెండా ఉందని నాదెండ్ల ఆరోపించారు. ఒకప్పుడు ఆధార్ కార్డును తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు ప్రతిదానికి ఆధార్‌ను లింక్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
మరోవైపు రాష్ట్రంలో పది లక్షల ఎకరాల భూమిని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. 2013 పునరావాసచట్టాన్ని తుంగలో తొక్కి భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. భూమి విలువకు నాలుగు రెట్లు చెల్లించిన తర్వాతే భూములు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
click on image to read-