టీపీసీసీ రేసులో జానా?
పెద్దలు జానారెడ్డి గారి దూకుడు చూస్తోంటే..ఏదో వ్యూహాన్ని అమలు చేస్తునట్లే కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఆరోపణలతో పార్టీలో తన ఉనికిని చాటుకోవడంతోపాటు, టీపీసీసీ రేసులో తానూ ఉన్నానన్న సంకేతాలు పంపుతున్నారన్న చర్చ మొదలైంది. ఎందుకంటే తాజాగా ఆయన మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సవాలు పాతదే అయినా.. అదే అస్ర్తాన్ని సంధించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, నాగార్జున సాగర్ పరిధిలో రెండో పంట విషయాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. ఈ రెండింటిని ప్రభుత్వం అమలు […]
BY sarvi11 July 2016 2:39 AM IST
X
sarvi Updated On: 11 July 2016 6:13 AM IST
పెద్దలు జానారెడ్డి గారి దూకుడు చూస్తోంటే..ఏదో వ్యూహాన్ని అమలు చేస్తునట్లే కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఆరోపణలతో పార్టీలో తన ఉనికిని చాటుకోవడంతోపాటు, టీపీసీసీ రేసులో తానూ ఉన్నానన్న సంకేతాలు పంపుతున్నారన్న చర్చ మొదలైంది. ఎందుకంటే తాజాగా ఆయన మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సవాలు పాతదే అయినా.. అదే అస్ర్తాన్ని సంధించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, నాగార్జున సాగర్ పరిధిలో రెండో పంట విషయాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. ఈ రెండింటిని ప్రభుత్వం అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు నెరవేరిస్తే.. తనపదవికి రాజీనామా చేసి, అధికార పార్టీకి ప్రచారకర్తగా పనిచేయడానికి తాను సిద్ధమేనని పునరుద్ఘాటించారు. వాస్తవానికి జానారెడ్డి ఈ సవాలును విసరడం గత నెలరోజుల్లో ఇది రెండోసారి. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. జానారెడ్డి దూకుడు చూస్తుంటే.. ఆయన టీపీసీసీ రేసులో ఉన్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
జానారెడ్డి డిమాండ్ చేస్తున్న రెండు విషయాల అమలు ఇప్పట్లో సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. అందుకే, ఆయన పదేపదే ఇదే విషయాన్ని తెరపైకి తీసుకువస్తున్నా ప్రభుత్వం వీటిపై నోరుమెదపడం లేదు. ప్రభుత్వం మీద జానారెడ్డి వరుసపెట్టి మాటల దాడి చేయడం వెనక ఏదో వ్యూహం ఉందన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఇప్పటికే తాము టీపీసీసీ రేసులో ఉన్నామని కోమటిరెడ్డి సోదరులు ప్రకటించారు. మరోవైపు నగరానికి చెందిన ఓ కీలక నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా పోటీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. డీకే అరుణను అధిష్టానం సంప్రదించినా.. ఆమె ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ పగ్గాలు చేపట్టలేనని చెప్పేశారు. దీంతో ఆ పదవికి జానారెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నారేమోనన్న అనుమానాలు కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన సర్కారును ఇబ్బంది పెట్టి, పార్టీలో తన హవాను నిలుపుకోవాలని యత్నిస్తున్నారని భావిస్తున్నారు.
Next Story