అమరావతిలో కూలిన రెయిలింగ్... ధృవీకరించిన టీడీపీ మీడియా
తాత్కాలిక రాజధాని నిర్మాణంలో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఫ్లోర్ కుంగిపోవడం కలకలం రేపింది. తాజాగా సచివాలయం ఒకటో భవనం రెయిలింగ్ సోమవారం కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. వారిని అక్కడే ఉన్న ఉద్యోగులు ఆస్పత్రికి తరలించారు. రాజధాని నిర్మాణ నాణ్యతపై కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేసిన కథనాలపై చంద్రబాబు, ఆయన మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు రెయిలింగ్ కూలిన విషయాన్ని టీడీపీ మీడియా ధృవీకరించింది. త్వరితగతిన […]
తాత్కాలిక రాజధాని నిర్మాణంలో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఫ్లోర్ కుంగిపోవడం కలకలం రేపింది. తాజాగా సచివాలయం ఒకటో భవనం రెయిలింగ్ సోమవారం కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. వారిని అక్కడే ఉన్న ఉద్యోగులు ఆస్పత్రికి తరలించారు. రాజధాని నిర్మాణ నాణ్యతపై కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేసిన కథనాలపై చంద్రబాబు, ఆయన మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు రెయిలింగ్ కూలిన విషయాన్ని టీడీపీ మీడియా ధృవీకరించింది.
త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్న ఉద్దేశంతో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని అందుకే నిర్మాణంలో ఉండగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. రాజధాని నిర్మాణంలో వరుస ప్రమాదాలపై సీపీఎం నాయకుడు బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని…వారికి తక్షణమే నష్టపరిహారమివ్వాలన్నారు.
click on image to read-