Telugu Global
Cinema & Entertainment

వరుస కేసుల్లో ఇరుక్కుంటున్న రజనీకాంత్ భార్య

కేవలం తెరపై హీరోగా మాత్రమే కనిపిస్తాడు రజనీకాంత్. తెరవెనక అతడి విషయాలన్నీ ఆయన భార్య లత చూసుకుంటారు. మరీ ముఖ్యంగా మనీ మేటర్స్ అన్నీ లత కనుసన్నల్లోనే జరుగుతాయి. ఆమెకు చెక్ పవర్ కూడా కల్పించాడు రజనీకాంత్. అంటే తను సంతకాలు పెట్టాల్సిన అవసరం కూడా లేదన్నమాట. సినిమా లావాదేవీలకు సంబంధించి లత సంతకం చేస్తే… తను చేసినట్టే. అందుకే ఏమైనా కేసులైనా అవి లత పేరు మీదే వస్తున్నాయి. వరుసగా రెండు ఫ్లాపులు రావడంతో పాటు… […]

వరుస కేసుల్లో ఇరుక్కుంటున్న రజనీకాంత్ భార్య
X

కేవలం తెరపై హీరోగా మాత్రమే కనిపిస్తాడు రజనీకాంత్. తెరవెనక అతడి విషయాలన్నీ ఆయన భార్య లత చూసుకుంటారు. మరీ ముఖ్యంగా మనీ మేటర్స్ అన్నీ లత కనుసన్నల్లోనే జరుగుతాయి. ఆమెకు చెక్ పవర్ కూడా కల్పించాడు రజనీకాంత్. అంటే తను సంతకాలు పెట్టాల్సిన అవసరం కూడా లేదన్నమాట. సినిమా లావాదేవీలకు సంబంధించి లత సంతకం చేస్తే… తను చేసినట్టే. అందుకే ఏమైనా కేసులైనా అవి లత పేరు మీదే వస్తున్నాయి. వరుసగా రెండు ఫ్లాపులు రావడంతో పాటు… ఆర్థికంగా కూడా నష్టం రావడంతో… ఇప్పుడు లతపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి.

తాజాగా రజనీకాంత్ భార్య లతకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కొచ్చాడయాన్ సినిమా హక్కుల వివాదంలో ఈ నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా హక్కులను లత అక్రమంగా అమ్మారని యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సుప్రీంలో కేసు దాఖలు చేసింది. లతా రజనీకాంత్ కొన్ని పత్రాలను ఫోర్జరీ చేశారని గత సంవత్సరం ఓ ఎఫ్ఐఆర్ దాఖలైంది. గ‌తంలోనూ ర‌జ‌నీ భార్య‌పై కేసులు న‌మోద‌య్యాయి. ర‌జ‌నీకాంత్‌, ల‌తా ర‌జ‌నీకాంత్‌ల‌కు చెందిన ఆస్తులు వేలానికి కూడా బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి. లింగా మూవీ భారీన‌ష్టాలు చ‌విచూసిన స‌మ‌యంలో డిస్ర్టిబ్యూట‌ర్లు కూడా ఆందోళ‌న‌కు దిగారు. ఇలా లతపై లింగ, కొచ్చడయాన్ ల ప్రభావం చాలానే కనిపిస్తోంది. ఈ కేసుల నుంచి బయటపడాలన్నా… ఆర్థిక కష్టాలు తీరాలన్నా… కబాలి సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలి.

First Published:  10 July 2016 7:09 AM IST
Next Story