గురివింద నీతులు మానుకో డిగ్గీ: హరీశ్
టీఆర్ ఎస్ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్‌కు హరీశ్‌రావు స్ర్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. అవినీతి, కుటుంబ పాలన గురించి మాట్లాడే అర్హత దిగ్విజయ్ సింగ్‌కి లేదని స్పష్టం చేశారు. ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెల్లువెత్తిన అవినీతి ఆరోపణల గురించి నోరు మెదపరేమని ప్రశ్నించారు. చివరికి అవే ఆరోపణలు ఆయన పదవి కోల్పోవడానికి కారణమయ్యాయన్న సంగతి గుర్తు లేదా? అని ఎద్దేవా చేశారు. అవినీతి గురించి కాంగ్రెస్ […]
BY sarvi10 July 2016 3:38 AM IST
X
sarvi Updated On: 10 July 2016 6:46 AM IST
టీఆర్ ఎస్ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్‌కు హరీశ్‌రావు స్ర్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. అవినీతి, కుటుంబ పాలన గురించి మాట్లాడే అర్హత దిగ్విజయ్ సింగ్‌కి లేదని స్పష్టం చేశారు. ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెల్లువెత్తిన అవినీతి ఆరోపణల గురించి నోరు మెదపరేమని ప్రశ్నించారు. చివరికి అవే ఆరోపణలు ఆయన పదవి కోల్పోవడానికి కారణమయ్యాయన్న సంగతి గుర్తు లేదా? అని ఎద్దేవా చేశారు. అవినీతి గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
మా పార్టీది కుటుంబ పాలన అని విమర్శించే ముందు దిగ్విజయ్ సింగ్ ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా కాంగ్రెస్ పార్టీ ఏ కుటుంబం కింద నడుస్తుందో.. ఆయన ఏ కుటుంబం కింద పనిచేస్తున్నారో దేశమంతా తెలుసని ఎగతాళి చేశారు. పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కోని, కుటుంబ పాలన కింద బతుకున్న దిగ్గీలాంటి వారికి లోకమంతా అలాగే కనిపిస్తుందని చురకలంటించారు.
2004 తరువాత టీఆర్ ఎస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన 16 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నపుడు దిగ్విజయ్ ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి ని కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతుందని ఆరోపించారు. ఎలాగైనా ఇక్కడి అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఇలాంటి విమర్శలకు దిగుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితబోధ చేశారు.
Next Story