కమ్ముల మెల్లగా ప్రారంభించాడు...
శేఖర్ కమ్ముల సినిమాలు ఎంత సైలెంట్ గా, నెమ్మదిగా ఉంటాయో… అతడి సినిమా మేకింగ్ కూడా అంతే నిదానంగా ఉంటుంది. ఏమాత్రం కంగారు పడడు. ఎలాంటి హడావుడి ఉండదు. తన స్క్రిప్ట్ కు హీరోహీరోయిన్లను ఎంపిక చేసుకోవడం నుంచి, వాళ్లుకు ట్రయినింగ్ కార్యక్రమం కూడా నిర్వహిస్తాడు కమ్ముల. ఆ తర్వాతే సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఆ తర్వాత ఇంకో కార్యక్రమం మొదలవుతుంది. డైలీ సీరియల్ తరహాలో రీళ్లకు రీళ్లు సన్నివేశాలు తీస్తూనే ఉంటారు. దాదాపు 4 […]
శేఖర్ కమ్ముల సినిమాలు ఎంత సైలెంట్ గా, నెమ్మదిగా ఉంటాయో… అతడి సినిమా మేకింగ్ కూడా అంతే నిదానంగా ఉంటుంది. ఏమాత్రం కంగారు పడడు. ఎలాంటి హడావుడి ఉండదు. తన స్క్రిప్ట్ కు హీరోహీరోయిన్లను ఎంపిక చేసుకోవడం నుంచి, వాళ్లుకు ట్రయినింగ్ కార్యక్రమం కూడా నిర్వహిస్తాడు కమ్ముల. ఆ తర్వాతే సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఆ తర్వాత ఇంకో కార్యక్రమం మొదలవుతుంది. డైలీ సీరియల్ తరహాలో రీళ్లకు రీళ్లు సన్నివేశాలు తీస్తూనే ఉంటారు. దాదాపు 4 గంటల నిడివి కలిగిన సినిమా తయారవుతుంది. ఆ తర్వాత దాంట్లోంచి రెండున్నర గంటల బొమ్మ కట్ చేస్తారు. ఇలా శేఖర్ కమ్ముల మేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు మరోసారి అదే బాటలో సినిమా మేకింగ్ మొదలుపెట్టాడు కమ్ముల.
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తర్వాత చాలాకాలంగా ఖాళీగా ఉన్న శేఖర్ కమ్ముల… మెగా హీరో వరుణ్ తేజ్ తో సినిమా చేయబోతున్నాడు. అమెరికా అబ్బాయికీ, తెలంగాణ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథగా రాబోతున్న ఈ మూవీలోకి… సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకున్నాడు. ఆగస్ట్ నుంచి షూటింగ్ జరుపుకోబోతోన్న ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశాడు. శేఖర్ కమ్ముల ఏ సినిమా చేసినా ఆర్టిస్టులకు స్క్రిప్ట్ పై అవగాహన పెంచేందుకు వర్క్ షాప్స్ నిర్వహిస్తుంటాడు. ఇప్పుడు కూడా వరుణ్ తేజ్, సాయి పల్లవిలకు తన స్క్రిప్ట్ ను ఎక్స్ ప్లెయిన్ చేస్తూ.. వారిని అందులో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇందులో భాగంగానే కొన్ని రోజులుగా హీరోహీరోయిన్లతో భేటీ అవుతున్నాడు.