నేనే బాగా నటిస్తా...లాలూ!
సినీ నటులకంటే చాలామంది రాజకీయ నాయకులు తమ నిజజీవితంలో మరింత బాగా నటిస్తుంటారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే బీహార్ ఆర్‌జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఒక సందర్భంలో ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పారు. తాను ఏ సినిమా స్టార్ కంటే తక్కువ నటుడేమీ కాదని ఆయన అన్నారు. తనపై ఒక సినిమా తీస్తే అందులో తానే నటిస్తానని చెబుతూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. బాలివుడ్ నటుడు ఇర్ఫాన్ తన రాబోయే […]

సినీ నటులకంటే చాలామంది రాజకీయ నాయకులు తమ నిజజీవితంలో మరింత బాగా నటిస్తుంటారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే బీహార్ ఆర్‌జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఒక సందర్భంలో ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పారు. తాను ఏ సినిమా స్టార్ కంటే తక్కువ నటుడేమీ కాదని ఆయన అన్నారు. తనపై ఒక సినిమా తీస్తే అందులో తానే నటిస్తానని చెబుతూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. బాలివుడ్ నటుడు ఇర్ఫాన్ తన రాబోయే చిత్రం మదారీ ప్రచార కార్యక్రమంలో ఉండగా లాలూ ఆయనను కలిశారు. తనపై సినిమా తీస్తే కథానాయకిని ఎంపిక చేసే బాధ్యత మాత్రం ఇర్ఫాన్ దేనని లాలూ చెప్పుకొచ్చారు. లాలూకి సినిమాలన్నా, సినిమా తారలన్నా ప్రత్యేక అభిమానం ఉన్నట్టుగానే ఉంది. గతంలో ఆయన బీహార్ రోడ్లను హేమమాలిని బుగ్గల్లా నున్నగా ఉండేలా చర్యలు తీసుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే.