కేసీఆర్ కు కొత్త సిపాయి దొరికాడు
సీఎం కేసీఆర్‌కు కొత్త సిపాయి దొరికాడు. అదేనండీ.. నమ్మినబంటు లభించాడని! అదేంటి.. రాష్ట్రంలో, టీఆర్ ఎస్ నాయకుల్లో ఇప్పటికే ఆయనకు చాలామంది నమ్మిన బంట్లు ఉన్నారుగా.. మళ్లీ కొత్తగా ఈ సిపాయి ఎవరు? అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు. టీఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మవరపు శ్రీనివాస్ అలియాస్ డీఎస్. తనకు రాజ్యసభ సీటు ఇచ్చి పార్లమెంటుకు పంపిన కేసీఆర్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేదని, జీవితాంతం ఆయనకు సిపాయిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశారు. ఎంపీ అయ్యాక తొలిసారిగా […]
సీఎం కేసీఆర్‌కు కొత్త సిపాయి దొరికాడు. అదేనండీ.. నమ్మినబంటు లభించాడని! అదేంటి.. రాష్ట్రంలో, టీఆర్ ఎస్ నాయకుల్లో ఇప్పటికే ఆయనకు చాలామంది నమ్మిన బంట్లు ఉన్నారుగా.. మళ్లీ కొత్తగా ఈ సిపాయి ఎవరు? అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు. టీఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మవరపు శ్రీనివాస్ అలియాస్ డీఎస్. తనకు రాజ్యసభ సీటు ఇచ్చి పార్లమెంటుకు పంపిన కేసీఆర్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేదని, జీవితాంతం ఆయనకు సిపాయిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశారు. ఎంపీ అయ్యాక తొలిసారిగా ఆయన సొంత జిల్లా నిజామాబాద్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీనన్న పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ జాప్యానికి అసలు కారణం కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్లేనని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైతే తమ పదవులకు ఇబ్బంది వస్తుందన్న ఆందోళనతోనే వారు ఈ విషయంలో కావాలని తాత్సారం చేశారని వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రం అనివార్యతను తాను, కేసీఆర్ కలిసి సోనియా గాంధీకి వివరించడంతోనే ఆమె అంగీకరించారని తెలిపారు. సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమంటూ ఉద్ఘాటించారు. ఏడాది క్రితం వరకు కాంగ్రెస్‌లో కొనసాగిన శ్రీనన్న ఇప్పుడు అదే పార్టీపై విమర్శలు చేయడం ఆ పార్టీనేతలు సహించలేకపోతున్నారు. పదవుల కోసం పార్టీలు మారిన మాటలకు విలువ ఉండదని ఎదురుదాడి చేస్తున్నారు. ఏడాదిలో రాష్ట్రంలో కేబినెట్, ఢిల్లీ స్థాయిలో ఎంపీ పదవికట్టబెడితే… ఇలాంటి ఆరోపణలు చేయడంలో వింతేంలేదంటున్నారు.