వీరప్పన్ అడవిలో సన్యాసిలా బతికాడు...భార్య ముత్తులక్ష్మి!
తన భర్త వీరప్పన్ గురించి ఎవరేమనుకున్నా తనకు మాత్రం అతను వీరపురుషుడేనని అతని భార్య ముత్తులక్ష్మి అన్నారు. వీరప్పన్‌తో తనకు 15ఏళ్ల వయసులో వివాహం జరిగిందని, అతను తనను ఎప్పుడూ బాధపెట్టలేదని, ఎంతో మర్యాదగా గౌరవంగా చూసుకున్నాడని ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. ఏనుగులను చంపాడని, గంధపు చెట్లను నరికాడని అందరూ అంటారు కానీ దానివలన అతను లాభపడింది లేదని, అతనివెనుక ఉన్న పెద్ద మనుషులే ఆ లబ్దిని పొందారని, వారి కారణంగానే వీరప్పన్ బలి పశువుగా మారాడని ఆమె చెప్పారు. […]
తన భర్త వీరప్పన్ గురించి ఎవరేమనుకున్నా తనకు మాత్రం అతను వీరపురుషుడేనని అతని భార్య ముత్తులక్ష్మి అన్నారు. వీరప్పన్‌తో తనకు 15ఏళ్ల వయసులో వివాహం జరిగిందని, అతను తనను ఎప్పుడూ బాధపెట్టలేదని, ఎంతో మర్యాదగా గౌరవంగా చూసుకున్నాడని ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. ఏనుగులను చంపాడని, గంధపు చెట్లను నరికాడని అందరూ అంటారు కానీ దానివలన అతను లాభపడింది లేదని, అతనివెనుక ఉన్న పెద్ద మనుషులే ఆ లబ్దిని పొందారని, వారి కారణంగానే వీరప్పన్ బలి పశువుగా మారాడని ఆమె చెప్పారు.
చిన్నతనంలో ఎవరో ఏనుగు దంతాలను దొంగిలిస్తే, వీరప్పన్‌ను కుక్కలా సంకెళ్లతో బంధించి తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టారని, అతను అలా మారడానికి ఆ సంఘటన కూడా దోహదం చేసి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. వీరప్పన్ అడివిలో ఒక సన్యాసిలా బతికాడని, అతనికి పేద గొప్ప తారతమ్యాలంటే నచ్చేది కాదని ముత్తులక్ష్మి అన్నారు. తమ వద్దకు వచ్చే పోలీస్ ఇన్‌ఫార్మన్లను గురించి తెలిసినా, వారిని వదిలేసేవాడని, వారిని చంపితే, తనవారిని చంపుతారేమో అనే భయం వీరప్పన్‌కు ఉండేదన్నారు.
వీరప్పన్‌తో నాలుగేళ్లే కలిసున్నానని, ఆ తరువాత జీవితంలో తాను ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలే తనని దృఢమైన మహిళగా తయారుచేశాయన్నారామె. వీరప్పన్ సినిమాకు కాపీరైట్స్ నిమిత్తం రామ్ గోపాల్ వర్మ వద్ద 25 లక్షలు తీసుకుని ఎందుకు గొడవ చేస్తున్నారని ప్రశ్నించగా ఒప్పంద పత్రాల్లో ఏముందో తెలియకుండానే సంతకం చేశానని, సినిమా తమిళ వెర్షన్‌ని తానే విడుదల చేయాలని అనుకున్నానని, రామ్‌గోపాల్ వర్మ మాట తప్పాడని ఆమె పేర్కొన్నారు. త్వరలో వీరప్పన్‌పై ఓ పుస్తకాన్ని తానే ప్రచురించబోతున్నట్టుగా ముత్తులక్ష్మి వెల్లడించారు.