తీరని ఆకలి- ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం
చంద్రబాబు ప్రభుత్వానికి భూదాహం తీరడం లేదు. ఇప్పటికే రాజధాని కోసం అవసరానికి మించి 33 వేల ఎకరాలు సేకరించిన ప్రభుత్వం… ఇప్పుడు కృష్ణా జిల్లాలో మరో లక్ష ఎకరాలకు టెండర్ పెట్టింది. శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ, ఇండస్ట్రీయల్ కారిడార్ కోసం లక్ష 5 ఎకరాలను సేకరించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకు కేబినెట్ కూడా ఓకే చెప్పింది. కేబినెట్ భేటీ అనంతరం వివరాలను సమాచార శాఖ […]
చంద్రబాబు ప్రభుత్వానికి భూదాహం తీరడం లేదు. ఇప్పటికే రాజధాని కోసం అవసరానికి మించి 33 వేల ఎకరాలు సేకరించిన ప్రభుత్వం… ఇప్పుడు కృష్ణా జిల్లాలో మరో లక్ష ఎకరాలకు టెండర్ పెట్టింది. శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ, ఇండస్ట్రీయల్ కారిడార్ కోసం లక్ష 5 ఎకరాలను సేకరించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకు కేబినెట్ కూడా ఓకే చెప్పింది.
కేబినెట్ భేటీ అనంతరం వివరాలను సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వివరించారు. కృష్ణా జిల్లాలోని 29 గ్రామాల్లో 426 చదరపు కిలోమీటర్ల పరిధిలో లక్షా 5 ఎకరాలు సేకరిస్తాయని చెప్పారు. అమరావతి కోసం అమలు చేసిన ల్యాండ్ పూలింగ్ నియమనిబంధనలనే ఇక్కడ కూడా అమలు చేస్తాయని పల్లె చెప్పారు. 2017 జులై 7 నాటికి లక్ష ఐదు ఎకరాల ల్యాండ్ పూలింగ్ పూర్తికి గడువు పెట్టుకున్నట్టు పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. ఇప్పటికే పంటలు పండే భూములను రాజధాని కోసం నాశనం చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో లక్షా 5 ఎకరాలు సేకరించాలని నిర్ణయించడం ఆశ్చర్యంగానే ఉంది. ఇలా ఏకకాలంలో లక్ష ఎకరాలు సేకరించిన చరిత్ర భారతదేశంలోనే లేదని చెబుతున్నారు.
click on image to read-