పులివెందుల్లో ఎలా గెలవాలో సింపుల్‌గా చెప్పేసిన చంద్రబాబు
మన చుట్టూ ఉన్న పరిసరాలు, వ్యక్తులు మనపై చాలా ప్రభావం చూపుతుంటారని శాస్త్రం చెబుతోంది. ఒక్కోసారి మన మైండ్ సెట్ కూడా పక్క వాళ్ల ట్రాప్‌లో పడిపోతుంటుంది. ఇక చుట్టూ ”మీరు సూపరండి” అని పొగిడే వారే ఉంటే … ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోతుంది. చేస్తున్న తప్పులు కనిపించవు. కేవలం డబ్బాల వాయింపు సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపైనా పరిస్థితులు అలాంటి ప్రభావమే చూపుతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. రాష్ట్ర జనాభాలో దాదాపు సగం […]
మన చుట్టూ ఉన్న పరిసరాలు, వ్యక్తులు మనపై చాలా ప్రభావం చూపుతుంటారని శాస్త్రం చెబుతోంది. ఒక్కోసారి మన మైండ్ సెట్ కూడా పక్క వాళ్ల ట్రాప్‌లో పడిపోతుంటుంది. ఇక చుట్టూ ”మీరు సూపరండి” అని పొగిడే వారే ఉంటే … ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోతుంది. చేస్తున్న తప్పులు కనిపించవు. కేవలం డబ్బాల వాయింపు సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపైనా పరిస్థితులు అలాంటి ప్రభావమే చూపుతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది.
రాష్ట్ర జనాభాలో దాదాపు సగం మంది మహిళలు ఉంటారు. వారిలో మేజారిటీ మహిళలు డ్వాక్రా సంఘాల్లో ఉంటారు. వారికి ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత ఏం చేశారో డ్వాక్రా సంఘాల సాయంకాలం మీటింగ్‌లకు వెళ్లి వింటే తెలుస్తుంది. ఇచ్చిన అన్ని హామీలనుముక్కలు చెక్కలు చేశారు. అయినా సరే 80 శాతంమంది తన పనితీరును తెగ ఇష్టపడుతున్నారంటూ తనకు తామే ఒక సర్వేను విడుదల చేసుకున్నారు చంద్రబాబు. ఆ సర్వే ఎవరు చేశారో మాత్రం ఎక్కడా చెప్పలేదు. ఇది ఒక ఎత్తు అయితే పార్టీ ముఖ్యనేతల సమావేశంలో పులివెందుల్లో కూడా ఎలా గెలవాలో సింపుల్‌గా చంద్రబాబు చెప్పేశారు.
ప్రస్తుతం 60 శాతం మంది వైసీపీ వైపు ఉంటే 30శాతం మంది టీడీపీకి మద్దతుగా పులివెందులలో ఉన్నారని తన లెక్కలు చెప్పారు చంద్రబాబు. కాబట్టి వైసీపీ బలాన్ని 30శాతానికి తగ్గించి, టీడీపీ బలాన్ని 60 శాతానికి పెంచేస్తే సరిపోతుందని సింపుల్‌గా వ్యూహరచన చేసేశారు. ఇది విన్న ముఖ్యనేతలు చెబుతున్నది ముఖ్యమంత్రి కదాని తలూపి వచ్చేశారు. పులివెందుల సంగతి ఎందుకు గానీ… నారావారి సొంతూరు నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీని ఎలా గెలిపించాలి… టీడీపీ వ్యవస్థాపకుడు, మామ ఎన్టీఆర్ సొంతూరు ఉన్న గుడివాడలో పచ్చ జెండా ఎలా పాతాలో ముందు ఆలోచిస్తే బాగుంటుందని కొందరు టీడీపీ నేతలే ఆఫ్ లైన్‌లో జోకులేసుకుంటున్నారు.
click on image to read-