బాబు కొత్త సర్వే ఫలితాలు.. "ఇకేం రాజీనామాలు చేయవచ్చు"
ఎవరు చేశారో? ఎప్పుడు చేశారో గానీ?.. ఎప్పటిలాగే చంద్రబాబు హఠాత్తుగా మరో సర్వే రిపోర్టు బయటకు తీశారు. గురువారం విజయవాడలో తన నివాసంలో మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో సుధీర్ఘంగా సమావేశమైన చంద్రబాబు… సర్వే ఫలితాలు వెల్లడించారు. సర్వే ఫలితాలను చూసిన మంత్రులు, ముఖ్యనేతలు కూడా మౌనంగా ఉండిపోయారట.సర్వేలో 80 శాతం మంది ప్రజలు ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా ఉన్నట్టు తేలిందని చంద్రబాబు వెల్లడించారు. ఎమ్మెల్యేల పనితీరు మాత్రం బాగోలేదని సర్వేలో తేలిందని చెప్పారు. కేవలం 40 శాతం […]
ఎవరు చేశారో? ఎప్పుడు చేశారో గానీ?.. ఎప్పటిలాగే చంద్రబాబు హఠాత్తుగా మరో సర్వే రిపోర్టు బయటకు తీశారు. గురువారం విజయవాడలో తన నివాసంలో మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో సుధీర్ఘంగా సమావేశమైన చంద్రబాబు… సర్వే ఫలితాలు వెల్లడించారు. సర్వే ఫలితాలను చూసిన మంత్రులు, ముఖ్యనేతలు కూడా మౌనంగా ఉండిపోయారట.సర్వేలో 80 శాతం మంది ప్రజలు ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా ఉన్నట్టు తేలిందని చంద్రబాబు వెల్లడించారు. ఎమ్మెల్యేల పనితీరు మాత్రం బాగోలేదని సర్వేలో తేలిందని చెప్పారు. కేవలం 40 శాతం మంది మాత్రమే ఎమ్మెల్యేల పనితీరుపై సంతృప్తిగా ఉన్నారని బాబు వివరించారు.
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే… రెండు నెలల క్రితమే చంద్రబాబు ఒక విషయం చెప్పారు. 80 శాతం ప్రజలు మన వైపు ఉండేలా చూడాలని. అనుకున్నట్టుగానే రెండు నెలలు తిరగకముందే అచ్చం 80 శాతం మంది జనం ప్రభుత్వంపై సంతృప్తితో ఉన్నారంటూ సర్వేను విడుదల చేసుకున్నారు చంద్రబాబు. సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తేలాయి. ఎన్టీఆర్ వైద్యసేవ పథకం అద్బుతమని ప్రజలు అభిప్రాయపడ్డారట. ఆ పథకానికి ఏకంగా 28 పథకాల్లో రెండో స్థానం వచ్చింది.
కొన్ని నెలల క్రితం తిరుపతిలో టీడీపీ అన్ని జిల్లాల నేతలతో సమావేశం జరగ్గా… ఆ సమావేశంలో చాలా మంది పార్టీ కార్యకర్తలే ఎన్టీఆర్ వైద్య సేవ గురించి తమకు తెలియదని చెప్పారు. ఆరోగ్యశ్రీ ని ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చామని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆ సమావేశంలో నేతలకు వచ్చింది. అలా టీడీపీ కార్యకర్తలకు కూడా సరిగాపేరు తెలియని ఎన్టీఆర్ వైద్యసేవకు సర్వేలో రెండో స్థానం దక్కిందని చెప్పడం బట్టే ఈ సర్వేపై టిడిపి నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటిలాగే పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న పౌరసరఫరాల శాఖ పనితీరు బాగుందంటూ నాలుగో స్థానం కట్టబెట్టారు. రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిందని టీడీపీ నేతలే విమర్శలు చేస్తున్న వేళ .. రెవెన్యూ, పోలీస్ శాఖలో అవినీతి తగ్గిందని జనం చెప్పారని చంద్రబాబు సర్వే చెబుతోంది. ఇకేం… జనం సంతృప్తిగా ఉన్నారు కాబట్టి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్తే బాగుంటుంది.
click on image to read-